KIFF 2022: అమితాబ్ పాదాలకు నమస్కారం చేసిన షారుక్ - ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?
కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుక్, అమితాబ్ పాల్గొన్నారు.
కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తన తర్వాతి సినిమా ‘పఠాన్’పై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై షారుక్ ఖాన్ స్పందించాడు. ‘పఠాన్’ సినిమాలో మొదటి పాట ‘బేషారం రాంగ్’ పాట విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో #BoycottPathaan ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ పాటలో కాషాయం, గ్రీన్ కలర్ దుస్తులను షారుక్, దీపిక ఉపయోగించడంపై వివాదం తలెత్తింది.
సంకుచిత భావాలు ఎక్కువైపోయాయి
‘పఠాన్’పై సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ గురించి ఎత్తకుండా షారుక్ ఈ ఈవెంట్‌లో మాట్లాడాడు. ‘హ్యూమన్ ఎమోషన్స్, ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తీకరించడంలో సినిమా, సోషల్ మీడియా కీలకంగా మారాయి. ప్రస్తుతం సినిమా ఇంకా కీలక పాత్ర పోషిస్తుంది.’ అన్నారు. సోషల్ మీడియాలో సంకుచిత భావాలు ఎక్కువ అయిపోయాయని కూడా తెలిపారు. ‘నెగిటివిటీ కారణంగానే సోషల్ మీడియా వినియోగం పెరిగిందని నేను ఎక్కడో చదివాను. ఈ కారణంగా దీని కమర్షియల్ వాల్యూ కూడా పెరిగింది.’ అని పేర్కొన్నారు.
రానున్న తరాల కోసం మంచి ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రపంచ సినిమా వేదికపై ప్రపంచాన్ని కలవడం ఇప్పుడు చాలా అవసరం. వివిధ సంస్కృతులు, రంగులు, వర్గాలు, మతాలకు చెందిన ప్రజలు ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చేసే శక్తి సినిమాకు ఉంది. కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికల ద్వారా అది సాధ్యం అవుతుంది. సినిమా ద్వారా రాబోయే తరాల కోసం మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం.’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ పాదాలకు షారుక్ ఖాన్ నమస్కారం చేయడం ఇప్పుడు వైరల్ అవుతుంది. వెంటనే షారుక్ ఖాన్‌ను అమితాబ్ బచ్చన్ ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను షారుక్ ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది పెద్దలపై షారుక్ ఖాన్ గౌరవాన్ని చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram