By: ABP Desam | Updated at : 03 Sep 2023 04:17 PM (IST)
Photo Credit : Kiccha Sudeep
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుదీప్. అప్పటినుంచి ఆయన తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈమధ్య పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుండడంతో కన్నడ తో పాటు అన్ని భాషల్లో కిచ్చా సుదీప్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇక ఈరోజు కిచ్చా సుదీప్ బర్త్ డే. దీంతో ఆయన లేటెస్ట్ మూవీస్ కు సంబంధించి అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సుధీప్ తో పాటూ మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం విశేషం.
ఇక సుదీప్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. సినిమాలపరంగా తన విలక్షణ నటనతో కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సుదీప్. సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఈరోజు కి కిచ్చ సుదీప్ బర్త్డే కానుకగా ఆర్ సి స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాహుబలి, 'RRR' చిత్రాల కథా రచయిత, దర్శకధీరుడు ఎస్,ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తుండటం తో పాటూ సూపర్ విజయం చేస్తూ ఉండడం విశేషం.
కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన ఆర్సి స్టూడియో సంస్థ కిచ్చ సుదీప్ తో చేస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్టు కి ఆర్. చంద్రు దర్శకత్వ వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ దర్శకుడు కన్నడ హీరో ఉపేంద్ర తో 'కబ్జా' అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ సైతం కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే దర్శకుడితో భారీ బడ్జెట్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడలో వచ్చిన సినిమాలు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు సుదీప్ తో చేయబోయే సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానునట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు తో పాటు కిచ్చ సుదీప్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మరో సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 'మ్యాక్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. కలైపులి ఎస్. తను సమర్పణలో వీ క్రియేషన్స్, కిచ్చ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది.
Also Read : పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>