అన్వేషించండి

బాలీవుడ్ నయా 'డాన్' సరసన 'గేమ్ ఛేంజర్' హీరోయిన్?

బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ 'డాన్ 3' లో షారుఖ్ ఖాన్ ప్లేస్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా.. అతని సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో సూపర్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన 'డాన్' కి పార్ట్ 3 రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు భాగాల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించగా, ఇప్పుడు 'డాన్ 3'లో బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ కపూర్ నటిస్తున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ బుధవారం మూవీ టీం టీజర్ ని కూడా విడుదల చేసింది. ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. 'డాన్ 3' లో రణ్ వీర్ సింగ్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. దాంతో పాటూ సినిమాలో రణవీర్ సరసన ఎవరు నటిస్తున్నారనే ఆసక్తి కూడా బాలీవుడ్ ఆడియన్స్ లో నెలకొంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. 'డాన్ 3' సినిమాని నిర్మిస్తున్న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫీసులో కియారా అద్వానీ కనిపించడంతో ఇది నిజమే అంటూ వార్తలు వస్తున్నాయి.  ఇటీవల కియారా అద్వానికి డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ చెప్పిన కథ బాగా నచ్చిందని, దీంతో ఇందులో నటించడానికి ఆమె అంగీకారం తెలిపిందని సమాచారం. రణవీర్ సింగ్ తో నటించడం అంటే కియారా అద్వానికి చాలా ఇష్టమట. అందుకే ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో కియారా అద్వానీ నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం కియార అద్వానీ టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' అనే సినిమాలో నటిస్తోంది. దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక 'డాన్ 3' విషయానికొస్తే.. తాజాగా విడుదలైన టీజర్ లో రణవీర్ సింగ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ టీజర్ ను డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ..' కొత్త శకం ప్రారంభమైంది' అనే క్యాప్షన్ పెట్టారు. ఓ ఎత్తయిన బిల్డింగ్ లోపల అటువైపు ముఖం చేసి రణ్ వీర్ కూర్చున్న షాట్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఓ లెదర్ జాకెట్, లెదర్ షూస్ వేసుకొని ఉన్న రణవీర్ సింగ్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తారు. ఇక బ్యాగ్రౌండ్ లో తనను డాన్ లాగా పరిచయం చేస్తూ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. టీజర్ చివర్లో 11 దేశాల పోలీసులు అతన్ని పట్టుకోవాలని చూస్తున్నారని, అతన్ని ఎవరైనా పట్టుకోగలరా అంటూ డాన్ లాగా రణవీర్ సింగ్ దర్శనమివ్వడం టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2025 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రణవీర్ సింగ్ తాజాగా 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది.

Also Read : ఓరి వీరి వేషాలో, సుధీర్‌పై అలిగిన రష్మీ - మళ్లీ మొదలైన ‘పులిహోర’ లవ్ స్టోరీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె
ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె
TN 2026 Vs Jana Nayagan: టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
Trisha: నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
AA22xA6 Title: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Pakistan Smart Lockdown: పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
Revanth vs Vijayan: రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
Activated carbon: కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget