Vijay Sethupathi : కష్టపడ్డాడు, కోట్లు కూడబెట్టాడు - విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా తెలిస్తే షాకవుతారు
Vijay Sethupathi : కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి సుమారు రూ.140 కోట్ల నికర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
Vijay Sethupathi's net worth : కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ సౌత్ యాక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్ అమాంతం పెంచుకుంటున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు తన టాలెంట్ తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హీరో గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీగా ఆస్తిపాస్తులు సంపాదించాడు. ఓ వార్తా సంస్థ రిపోర్ట్స్ ప్రకారం..
స్టార్ హీరోలకు సమానంగా విజయ్ సేతుపతికి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్, ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు.. ఇలా చాలానే ఉన్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల రేంజ్ లో రెమ్యురేషన్ తీసుకుంటున్నాడు. అలాగే బ్రాండ్స్ కి ప్రమోట్ చేసినందుకు ఒక్కో బ్రాండ్ కి దాదాపు రూ.50 లక్షలు చార్జ్ చేస్తున్నాడు. గత ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలో విలన్ పాత్ర కోసం ఏకంగా రూ.21 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు. బాలీవుడ్లో జవాన్ విజయ్ సేతుపతి తొలి చిత్రం. మొదటి సినిమాకే రూ.21 కోట్ల రేంజ్ రోమన్ రేషన్ అంటే మామూలు విషయం కాదు.
ప్రస్తుతం ఆయన చెన్నైలో నివసిస్తున్న ఇంటి విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందట. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ విజయ్ సేతుపతి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కిల్ పాక్, ఎన్నూరు.. వంటి ప్రాంతాల్లో ఆయనకి సుమారు రూ.100 కోట్ల ప్రాపర్టీ ఉన్నట్లు సమాచారం. ఇక విజయ్ సేతుపతి దగ్గర కాస్ట్లీ కార్లు కూడా ఉన్నాయి. ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయిన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు వాడే లగ్జరీ కార్లు విజయ్ సేతుపతి దగ్గర ఉండడం విశేషం. ఆయనకి స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం.
విజయ్ సేతుపతి గ్యారేజీలో జర్మన్ సెడాన్(1.81కోట్లు), BMW 7(రూ. 1.60 కోట్లు), రూ. 39.5 కోట్ల విలువైన మినీ కూపర్, టయోటా, ఇన్నోవా మరియు టయోటా, ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా మొత్తంగా ఇప్పటివరకు విజయ్ సేతుపతి నికర ఆస్తి విలువ సుమారు రూ.140 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా 'మేరీ క్రిస్మస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న హిందీ, తమిళ భాషల్లో విడుదలై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రామ్ చరణ్ బర్త్ డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన