అప్పుడే కొత్త సినిమాని ప్రకటించిన బాలీవుడ్ హీరో - ఆసక్తి రేపుతున్న టైటిల్ పోస్టర్!
రీసెంట్ గా ' సత్య ప్రేమ్ కి కథ' సినిమాతో బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ బయటకొచ్చింది.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో రణబీర్ కపూర్ తర్వాత మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇక ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఈ హీరో పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుస ప్లాపులు ఎదురవుతున్న క్రమంలో 'భూల్ భులయ్యా 2' సినిమాతో భారీ సక్సెస్ అందుకొని మళ్లీ ఇండస్ట్రీకి ఊపిరి పోశాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగుతున్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు గత కొంతకాలంగా ఇండస్ట్రీకి భారీ ప్లాప్స్ ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ 'భూల్ భులయ్యా 2' తో ఇండస్ట్రీకి సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు.
'ప్యార్ కా పంచనామా' అనే సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన కార్తిక్ ఆర్యన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా ఆరేళ్లలో ఏకంగా ఐదు డిజాస్టర్ సినిమాలు చేశాడు. మళ్లీ 2017లో 'సోను కే టిటు కే స్వీటీ' అనే సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా బాలీవుడ్లో ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'లూకా చుప్పి', 'పతి ఔర్ పత్ని', 'భూల్ భులయ్యా 2' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల హీరోగా మరి భారీ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన 'సత్య ప్రేమ్ కి కథ' కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. ఇలా ప్రతి సినిమాకు బాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటికి వచ్చేసింది. ఈ మేరకు కార్తీక్ ఆర్యన్ తన తదుపరి చిత్రాన్ని 'సత్య ప్రేమకి కథ' సినిమా నిర్మించిన నదియా వాలాతోనే చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి మేకర్స్ టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో 'ఏక్తా టైగర్', 'బజరంగీ భాయిజాన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న కబీర్ ఖాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. 'చందు చాంపియన్'(Chandu Champion) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 14, 2024న విడుదల కానుంది. కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోంది. ఓ స్పోర్ట్స్ మెన్ కి సంబంధించి రియల్ లైఫ్ స్టోరీ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే కార్తీక్ ఆర్యన్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ప్రాజెక్టు పై బాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కార్తీక్ ఆర్యన్ కమర్షియల్, రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్స్ లో మాత్రమే నటించాడు. మొదటిసారి ఈ స్పోర్ట్స్ జోనర్ టచ్ చేస్తున్నాడు. నిజానికి కార్తీక్ ఆర్యన్ చూడ్డానికి రొమాంటిక్ హీరోలా కనిపిస్తాడు. కానీ అతను ఫిజిక్ పరంగా ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి కచ్చితంగా సెట్ అవుతాడని చెప్పొచ్చు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
KARTIK AARYAN - KABIR KHAN - SAJID NADIADWALA TEAM UP FOR ‘CHANDU CHAMPION’… Based on the real-life story of a sportsman and his spirit of never giving up.… #KartikAaryan stars in #ChanduChampion, a #SajidNadiadwala and #KabirKhan presentation… 14 June 2024 #Eid2024 release…… pic.twitter.com/1UleNkKDGi
— taran adarsh (@taran_adarsh) July 4, 2023
Also Read : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో మెరిసిన సితార - సంతోషంతో ఉప్పొంగిపోయిన మహేష్ బాబు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial