By: ABP Desam | Updated at : 20 Aug 2022 07:03 PM (IST)
'కార్తికేయ 2'లో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి, 'వైవా' హర్ష
నార్త్ ఇండియాలో 'కార్తికేయ 2' (Karthikeya 2 Hindi Movie) విడుదలైన రోజున ప్రేక్షకులు ఎవరికీ సినిమా గురించి పెద్దగా తెలియదు. కేవలం 50 స్క్రీన్‌లలో సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు 'కార్తికేయ 2' హిందీ వెర్షన్స్ స్క్రీన్ కౌంట్ ఎంతో తెలుసా? వెయ్యి (1000) కి పైగా! దీన్ని బట్టి ఉత్తరాదిలో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) సినిమాకు ఎటువంటి ప్రేక్షకాదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్ల పరంగానూ సునామీ సృష్టిస్తోంది.
Karthikeya 2 Hindi Collection Worldwide Till Now : రోజు రోజుకూ 'కార్తికేయ 2' హిందీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, ఏడో రోజున రూ. 2.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక... రెండో రోజు రూ. 28 లక్షలు, మూడో రోజు రూ. 1.10 కోట్లు, నాలుగో రోజు రూ. 1.28 కోట్లు, ఐదో రోజు రూ. 1.38 కోట్లు, ఆరో రోజు రూ. 1.64 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద వారంలో రూ. 8.20 కోట్లు (నెట్) వసూలు చేసింది. మరో వారం రోజులు హిందీ మార్కెట్‌లో 'కార్తికేయ 2'కు ఇదే విధంగా వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Karthikeya 2 World Wide Collection Till Now - First Week : తెలుగు రాష్ట్రాల్లో కూడా 'కార్తికేయ 2'కు అద్భుత ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.50 కోట్లు, రెండో రోజు రూ. 3.81 కోట్లు, మూడో రోజు రూ. 4.23 కోట్లు, నాలుగో రోజు రూ. 2.17 కోట్లు, ఐదో రోజు రూ. 1.64 కోట్లు, ఆరో రోజు రూ. 1.34 కోట్లు, ఏడో రోజు రూ. 2.04 కోట్లు వసూలు చేసింది.
ప్రాంతాల వారీగా తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూస్తే...
నైజాం : రూ. 7.02 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 2.59 కోట్లు
సీడెడ్ : రూ. 2.91 కోట్లు
నెల్లూరు : రూ. 59 లక్షలు
గుంటూరు : రూ. 1.65 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావరి : రూ. 1.36 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 1.03 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు 'కార్తికేయ 2' సినిమా రూ. 29.55 కోట్ల గ్రాస్ (షేర్ వసూళ్లు రూ.18.69) కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో రూ. 1.64 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 3.25 కోట్లు, హిందీలో 4.45 కోట్లు (షేర్) వసూలు చేసింది.
హాఫ్ సెంచరీ కొట్టిన 'కార్తికేయ 2'
హిందీలో సినిమాకు బంపర్ కలెక్షన్స్ రావడంతో 'కార్తికేయ 2' తొలి వారంలో ఈజీగా హాఫ్ సెంచరీ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమా రూ. 50.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ విషయానికి వస్తే... రూ. 28.03 కోట్లుగా ఉంది. సినిమా నిర్మాణ వ్యయం, విడుదలైన పరిస్థితులు చూస్తే... 'కార్తికేయ 2' సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పాలి.
Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మతిరిగే రియాక్షన్
చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు.
Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
/body>