Klin Kaara Care Taker: క్లీంకార కేర్ టేకర్ ఎవరో తెలుసా? - ఆమె నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే
Klin Kaara Care Taker Salary: ఈ మధ్య సోషల్ మీడియాలో క్లీంకార వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కన్ను క్లీంకార కేర్ టేకర్‌పై పడింది. ఆమెను చూసి ఎక్కడో చూశామంటూ ఆరా తీయగా..
Ram Charan Daughter Klin Kaara Care Taker: వారసురాలు రాకతో మెగా కుటుంబమంత సంతోషంలో మునిగితేలుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు గతేడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆమెకు క్లీంకార అని నామకరణం కూడా చేశారు. క్లీంకార పుట్టినప్పటి నుంచి నుంచి మెగా ఇంట అన్ని శుభాలే జరుగుతున్నాయి. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ పొందడం. ఆ వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి, చిరంజీవిని 'పద్మ విభూషణ్' వరించడం వంటి శుభవార్తలే వింటున్నాం. అయితే ఇదంతా మనవరాలి రాకతోనే అని అప్పట్లోనే చిరు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు.
ఇక చిరుకు 'పద్మ విభూషణ్' వచ్చినప్పటి నుంచి మెగా వారసురాలి గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఇదంత క్లీంకార పుట్టిన వేళ విశేషమని అంతా వారసురాలికే క్రెడిట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో క్లింకార కేర్ టేకర్ కూడా వార్తల్లో నిలిచింది. ఈ మధ్య చరణ్-ఉపాసనలు ఏదోక వెకేషన్‌కు వెళుతూనే ఉన్నారు. వారితో పాటు క్లీంకార కూడా తీసుకువెళుతున్నారు. అయితే క్లీంకార పుట్టి ఆరు నెలలు దాటిన ఇంకా ఆమె ముఖాన్ని రివీల్ చేయలేదు. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా కూతురు ఫేస్ కనిపించకుండా ఉపాసన తెగ జాగ్రత్త పడుతుంది. దీంతో క్లీంకార ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Also Read: హైదరాబాద్ చేరుకున్న మహేష్ - సూపర్ స్టార్ కొత్త లుక్ చూశారా? వీడియో వైరల్
ఈ నేపథ్యంలో అందరి కన్ను క్లీంకార కేర్ టేకర్‌పై పడింది. ఆమెను చూసి ఎక్కడో చూశామంటూ ఆరా తీయగా ఆసక్తికర విషయం తెలిసింది. క్లీంకార కేర్ టేకర్ పేరు సావిత్రి.. ఆమె ఓ సెలబ్రిటీ ఆయా. గతంలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ దంపతుల పెద్ద కుమారుడు తైమూర్ ఆయాగా పని చేసింది. ఇప్పుడు ఆమెనే ఉపాసన క్లీంకార కేర్ టేకర్‌గా నియమించుకుంది. అంటే క్లీంకారతో వారు ఎక్కడికి వెళ్లినా, ఏ వెకేషన్‌కు వెళ్లిన వారితో పాటు సావిత్ర కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం మెగా వారసురాలి ఆలనాపాలన మొత్తం ఆమె చూసుకుంటుందట. ఇందుకోసం సావిత్రికి భారీగానే చెల్లిస్తున్నారట చరణ్-ఉపాసనలు. తమ కూతురు చూసుకునేందుకు నెలకు దాదాపు లక్షన్నర రూపాయలు జీతంగా ఇస్తున్నారట.
ఇది తెలిసి అంతా అవాక్కావుతున్నారు. 'సెలబ్రిటీ ఆయా అంటే ఆ రేంజ్ జీతం ఉంటుందని, ఇది కామన్' అని కొందరు అంటుంటే.. 'ఒక ఆయాకు లక్షన్నర జీతం ఏంటీ భయ్యా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే కూడా సావిత్రే ఎక్కువ సంపాదిస్తుంది' అంటూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా చరణ్ డబుల్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్రలో చరణ్ ప్రభుత్వ అధికారిక కనిపించున్నాడట. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్న చరణ్ మరోవైపు బుచ్చిబాబు ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.