Kantara Chapter 1 Day 1 Collections: ఫస్ట్ డే 'కాంతార చాప్టర్ 1' రికార్డు కలెక్షన్స్ - ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా!
Kantara Chapter 1 Collections: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ డేనే రూ.90 కోట్లకు చేరువలో వసూళ్లు సాధించింది.

Rishab Shetty's Kantara Chapter 1 First Day Box Office Collections: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి ప్రీమియర్లు, గురువారం ఫస్ట్ డే షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా కలెక్షన్స్ అనౌన్స్ చేశారు.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు మూవీ టీం వెల్లడించంది. ఇటు ఇండియా వ్యాప్తంగానూ ప్రభంజనం సృష్టిస్తోంది. భారత్‌లో ఫస్ట్ డే రూ.66 కోట్లు వసూళ్లయ్యాయి. కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో 1.28 మిలియన్ టికెట్లకు పైగా సేల్ అయ్యాయి. సెకండ్ డే కూడా గంటకు 70 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది బిగ్గెస్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో 'కాంతార చాప్టర్ 1' నిలిచింది.
అటు కర్ణాటకలో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ ఫస్ట్ డే దాదాపు రూ.20 కోట్లు, కన్నడ రూ.18 కోట్లు, తెలుగులో రూ.13 కోట్లు ఓపెనింగ్ డే వచ్చాయి. ఇక తమిళం రూ.5.25 కోట్లు, మలయాళంలో రూ.4.75 కోట్లు వచ్చాయి. మరోవైపు, ఓవర్సీస్‌లోనూ జోష్ కొనసాగుతోంది. ఫస్ట్ 2 రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram
Also Read: 'కాంతార' దేవుళ్ళు నిజంగా ఉన్నారా? పంజుర్లి, గుళిగ గురించి మిమ్మల్నిఆశ్చర్యపరిచే నిజాలు!
ఆడియన్స్ ఫిదా
2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కించారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. అడవి తల్లి కథ, భాంగ్రా రాజ్యపు సెట్, అడవి సెట్ అన్నీ కలిసి ఓ విజువల్ వండర్‌గా రూపొందించారు. రిషబ్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. పంజుర్లి, గుళిగతో పాటు ఈశ్వరుని దైవ గణాలను మూవీలో చూపించారు. క్లైమాక్స్ నిజంగా గూస్ బంప్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రి అదృశ్యం అయిన స్థలం నుంచి ఓ కొడుకు ప్రశ్నకు సమాధానంగా... 8వ శతాబ్దపు కదంబుల రాజ్యం, కాంతార దైవ భూమిలో మహిమాన్విత శక్తులను అద్భుతంగా చూపించారు.
మూవీలో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ మూవీని నిర్మించారు. అలాగే, జయరామ్, ప్రమోద్ శెట్టి, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















