అన్వేషించండి

Emergency Movie Release Date : ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతున్న 'ఎమర్జెన్సీ'... స్పెషల్ పోస్టర్​తో రిలీజ్ డేట్ ప్రకటించిన కంగనా  

Kangana Ranaut : ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది 'ఎమర్జెన్సీ' మూవీ. స్పెషల్ పోస్టర్ తో ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది కంగనా.  

Emergency Movie : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' మూవీ ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. తాజాగా కంగనా తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంగనా ఈ సినిమాలో లీడ్ రోల్​ చేయడంతో పాటు.. దర్శకత్వం వహించి, నిర్మించింది. ఈ బయోగ్రాఫికల్ పొలిటికల్ థ్రిల్లర్ ద్వారా 21 నెలల ఎమర్జెన్సీ పాలన కాలంలో ఇందిరా గాంధీ జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు. ఇది 1975 నుంచి 1977 మధ్యకాలంలో సాగే కథతో తెరకెక్కింది.

భారతదేశ చరిత్రలోనే వివాదాస్పద, గందరగోళ అధ్యాయంగా ఉన్న ఎమర్జెన్సీ కాలాన్ని తెరపైకి తీసుకురావడం అన్నది నిజంగా కంగనా రనౌత్ చేసిన సాహసం అనే చెప్పాలి. ఈ మూవీ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచే పలు అడ్డంకులను ఎదుర్కొంటుంది. సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న కారణంగా పలువురు రాజకీయ నాయకులు ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేశారు. పైగా మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ వినిపించింది. ఈ వివాదం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఆగేదాకా వెళ్ళింది. అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ కూడా ఆలస్యం కావడంతో కంగనా కోర్టుకెక్కింది. ఈ వివాదం కోర్టులో చాలా కాలం నడిచింది. 

సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కిన కంగనా ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ స్పందిస్తూ.. సినిమాలో నుండి పలు వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ జారీ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఈ విషయంపై ఆలోచిస్తామని చెప్పిన కంగనా, రోజురోజుకూ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో ఎట్టకేలకు ఓకే చెప్పారు. సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ తీసేసి, మూవీని రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. దీంతో సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికెట్ లభించడంతో రిలీజ్ కు అడ్డంకులు తొలగాయి. రీసెంట్ గా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ త్వరలోనే 'ఎమర్జెన్సీ' రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని గుడ్ న్యూస్ చెప్పింది కంగనా. అన్నట్టుగానే తాజాగా ఎమర్జెన్సీ సినిమాను 2025 జనవరి 17న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు స్పెషల్ రిలీజ్ పోస్టర్ తో తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

కాగా కొన్ని రోజుల క్రితం సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అయిన కారణంగా తాను దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా పడిందని, దీంతో ముంబైలోని తన ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చిందని కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆ నష్టాన్ని రిలీజ్ అయ్యాక 'ఎమర్జెన్సీ' భర్తీ చేస్తుందా? అనేది చూడాలి. ఓవైపు ఈ మూవీ వివాదం నడుస్తుంటే మరోవైపు "భారత భాగ్య విధాత" అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంగనా. ఈ మూవీకి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించబోతున్నారు. బబితా అశివాల్, ఆది శర్మ యునోయా ఫిలిమ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

Read Also: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget