RRR KRK Review: రాజమౌళిని జైల్లో పెట్టాలి, 'RRR' తలా తోకా లేని చిత్రం - ఇతడు రివ్యూ ఇస్తే సినిమా హిట్టే
Rajamouli Should Be Jailed, says KRK: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై బాలీవుడ్ క్రిటిక్, యాక్టర్ కమల్ ఆర్. ఖాన్ విరుచుకుపడ్డారు. 'RRR' తలా తోకలేని సినిమా అంటూ ట్వీట్లు చేశారు.
'RRR' తలా తోకా లేని సినిమా అంటున్నాడు బాలీవుడ్ క్రిటిక్ కమ్ యాక్టర్ కమల్ ఆర్. ఖాన్. హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు కంప్లీట్ కాకముందే... తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షోస్ స్టార్ట్ కాకముందే... దర్శకుడు రాజమౌళిపై, 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ట్విట్టర్‌లో విరుచుకుపడ్డాడు. తన అక్కసును అంతా వెళ్లగక్కాడు. 'ఆర్ఆర్ఆర్' అట్టర్ ప్లాప్ అని ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'తో కంపేర్ చేశాడు. కమల్ ఆర్ ఖాన్ ఏమన్నాడంటే...
"తలా తోకా లేని సౌత్ మసాలా సినిమా 'ఆర్ఆర్ఆర్'. రాజ మౌళీ సాబ్... తమాషా కొంచెం ఎక్కువ కాలేదా? కొంత అయినా లిమిట్ ఉండాలి. మీరు అన్ లిమిటెడ్ నుంచి ఊడిపడ్డారు. రాజమౌళి గారూ... ఈ రోజు నా నాలెడ్జ్ అంతా జీరో అయ్యింది. ఇటువంటి సినిమా ఎలా తీస్తారు సార్?" అని కమల్ ఆర్. ఖాన్ వెటకారంగా ట్వీట్లు చేశాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమాను 'ఆగ్' సినిమాతో కంపేర్ చేశాడు కమల్ ఆర్. ఖాన్. హిందీ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన 'షోలే'ను రామ్ గోపాల్ వర్మ తీసిన 'ఆగ్' పేరుతో రీమేక్ చేశారు. విడుదలకు ముందు ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన తర్వాత జనాలు ప్లాప్ అని తేల్చేశారు. 'ఆర్ఆర్ఆర్'ను 'ఆగ్'తో పోల్చడంతో అంటే సినిమా ప్లాప్ అనేది కమల్ ఆర్. ఖాన్ ఉద్దేశం అన్నమాట. ఆయన అక్కడితో ఆగలేదు. ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలని అంటున్నాడు.
"భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు తీయనటువంటి చెత్త సినిమా 'ఆర్ఆర్ఆర్'. దీన్ని పొరపాటు అని నేను అనను. ఇదొక పెద్ద నేరం. రూ. 600 కోట్ల రూపాయలతో ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలి" అని కమల్ ఆర్. ఖాన్ ట్వీట్స్ చేశాడు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' రివ్యూ: నందమూరి - కొణిదెల అభిమానులకు పండగే!
కమల్ ఆర్. ఖాన్ చెత్త సినిమా అన్నాడంటే... ఆ సినిమా సూపర్ హిట్ అని అర్థం. వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'బాహుబలి' సినిమా కూడా ఆయనకు నచ్చలేదు. ఆ సినిమాను ఆయన కార్టూన్ తో కంపేర్ చేశాడు. సూపర్ హిట్ సినిమాలకు ఈ విధంగా రివ్యూలు ఇచ్చాడు. అందువల్ల, రాజమౌళి ఫ్యాన్స్... ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు కమల్ ఆర్. ఖాన్ రివ్యూ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. 'బాహుబలి 2'లా 'ఆర్ఆర్ఆర్' కూడా భారీ హిట్ అవుతుందని అనుకుంటున్నారు.
Film #RRR is full time south Masala film without head and feet.
— KRK (@kamaalrkhan) March 24, 2022
It’s interval of #RRR! Raja Mauli Sahab, Kuch Zyada Hi Chutiyapa Nahi Ho Gaya? Kuch Toh Limit Honi Chahiye Sir. Matlab Aap Toh unlimited Par Utar Aaye Sir.😭
— KRK (@kamaalrkhan) March 24, 2022
Sir @ssrajamouli you are killing my all senses. My all knowledge has become Zero today. Kaise Kar lete ho sir? Maza Hi Aa Gaya sir. Every director makes his Aag and #RRR is your AAG.
— KRK (@kamaalrkhan) March 24, 2022
Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me.
— KRK (@kamaalrkhan) March 24, 2022
I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget.
— KRK (@kamaalrkhan) March 24, 2022