By: ABP Desam | Updated at : 26 Nov 2022 09:43 AM (IST)
నటి కల్పిక
నటి కల్పిక (Actress Kalpika) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. 'ప్రయాణం' నుంచి మొదలు పెడితే... తాజా 'యశోద' వరకు పలు సినిమాల్లో ఆమె నటించారు. కల్పిక చేసిన క్యారెక్టర్లు, ఆమె చేసిన పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. కొన్ని డేరింగ్ క్యారెక్టర్లలో కనిపించారు. రియల్ లైఫ్‌లో కూడా ఆమె డేరింగ్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. ఆ వ్యక్తిత్వమే ఈ మధ్య ఆవిడను వార్తల్లో నిలిచేలా చేసింది.
Kalpika Instagram Suspended : కల్పిక ఇటీవల ఓ కార్యక్రమంలో తనకు ఎదురైన ఘటన గురించి ధైర్యంగా గళం వినిపించారు. నటుడు అభినవ్ గోమటం (Abhinav Gomatam) తనను 'ఐటమ్' అనడంపై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనిధి కాలేజీ ఇష్యూ గురించీ గళం వినిపించారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఆవిడపై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ధోరణిపై కల్పిక పోరాటం ప్రారంభించారు. సోషల్ మీడియా ముసుగులో కొందరు చేస్తున్న వల్గర్ కామెంట్స్‌ను అందరి దృష్టికి తీసుకు రావడం స్టార్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తప్పుడు విధంగా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరిని ఎక్స్‌పోజ్ చేయడం స్టార్ట్ చేశారు కల్పిక. ఈ నేపథ్యంలో కొందరు రాయలేని విధంగా ఆమెను తిట్టడం స్టార్ట్ చేశారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ ట్రోలింగ్స్ చేశారు. వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ కల్పిక ధైర్యంగా నిలిచారు. అయితే... ఇన్‌స్టాగ్రామ్ ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేయడం గమనార్హం. నవంబర్ 25న ఆమె అకౌంట్ సస్పెండ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆవిడ తెలిపారు.
''మే 24న నాకు బ్లూ టిక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్. నవంబర్ 25న నా అకౌంట్‌ను రిస్ట్రిక్ట్ చేశారు. ఈ ఆరు నెలల డేటింగ్ పీరియడ్ బాగా గడిచింది. నిజం చెప్పినందుకు నా జీవితంలో చాలా మంది మగవాళ్ళతో నేను బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌తో కూడా బ్రేకప్ అవుతున్నాను. రిప్ ఇన్‌స్టాగ్రామ్. ఇప్పుడు నా జీవితం మిలియన్స్ స్పీడుతో వెళుతుంది'' అని కల్పిక చెప్పారు.
ఇటీవల ABP Desam తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన కల్పిక... సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో కొందరు చేస్తున్న వేధింపుల గురించి మాట్లాడారు. అటువంటి తగ్గాలంటే... ప్రతి ఒక్కరి అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు వంటి ఐడీలు ఇస్తే అకౌంట్స్ ఓపెన్ చేసే విధంగా రూల్ తీసుకు రావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read : 'ఇంటింటి రామాయణం' - పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది?
'యశోద'తో తేజు పాత్రలో కనిపించిన కల్పిక... ఆ సినిమా విడుదల అయిన రోజే తమిళ చలన చిత్ర పరిశ్రమకు కూడా పరిచయం అయ్యారు. 'యశోద' తమిళంలో కూడా విడుదల అయ్యింది. కల్పిక నటించిన తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా 'పెరోల్' కూడా నవంబర్ 11న విడుదల అయ్యింది. అందులో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. తమిళ విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వచ్చాయి.
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !