Kalki 2898 AD: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
Kalki Ticket Price In Andhra Pradesh: 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఎంత పెంచుకోవచ్చు? అనేది చూడండి.
Prabhas Kalki 2898 AD Ticket Price In AP: నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని తేడాలు లేవు. ఇండియా, అమెరికా అని అసలే బేధాలు లేవు. ఇప్పుడు ప్రపంచం అంతటా 'కల్కి 2898 ఏడీ' ఫీవర్ నెలకొంది. గురువారం ఉదయం తొలి ఆటకు వెళ్లాలని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, సామాన్య ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.
ఓవర్సీస్, అమెరికాతో పాటు తెలంగాణలో 'కల్కి 2898 ఏడీ' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలో ఇంకా కాలేదు. ఇవాళ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ స్క్రీన్లలో ఎంత పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయో తెలుసా?
సింగిల్ స్క్రీన్లలో 75... మల్టీప్లెక్స్‌లలో 125!
'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ మీద సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 125 రూపాయలు పెంచుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐదో ఆటకు సైతం పచ్చజెండా ఊపింది. రెండు వారాలు... అంటే 14 రోజుల పాటు ఈ వెసులుబాటు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం సైతం సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచింది. అయితే, అది 8 రోజుల వరకు మాత్రమే. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచింది. తొలి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు వేసే ఆటకు మాత్రం 200 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పింది. తెలంగాణతో పోలిస్తే... ఏపీలో ఎక్కువ రోజులు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఎక్కువ రేట్లు ఇచ్చారని చెప్పవచ్చు. కానీ, అక్కడ ప్రస్తుతం ఉన్న రేట్స్ దృష్ట్యా తెలంగాణలో కంటే టికెట్ రేట్ తక్కువ ఉండే అవకాశం ఉంది.
'ఆర్ఆర్ఆర్' రికార్డ్స్ 'కల్కి' బ్రేక్ చేస్తుందా? లేదా?
ఇప్పుడు అందరి చూపు 'కల్కి 2898 ఏడీ' ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ఉంది. తొలి రోజు ఎన్ని కోట్లు వస్తాయి? ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ వరకు వస్తే... ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్ సాధించిన రికార్డ్ 'ఆర్ఆర్ఆర్' పేరు మీద ఉంది. ఆ తర్వాత ప్రభాస్ 'సలార్', 'బాహుబలి 2' సినిమాలు ఉన్నాయి. మరి, 'కల్కి 2898 ఏడీ'తో ప్రభాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడో? లేదో? వెయిట్ అండ్ సి.
Also Read: విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... ప్రభాస్ సినిమాలో కురుక్షేత్రంలో యుద్ధవీరుడిగా... ఆయన రోల్ ఏమిటంటే?
నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్లస్ ఫస్ట్ డే టికెట్స్ కలిపి ఆల్రెడీ 3 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది 'కల్కి'. అక్కడ భారీ వసూళ్ల దిశగా సినిమా దూసుకు వెళుతోంది.
#Kalki2898AD - North America
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 24, 2024
( Premieres + Day 1 )
- $ 𝟑 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Pre Sales 🔥🔥
And obviously when it’s this man’s rage, it’s all about RAISING THE BAR ❤️🔥❤️🔥#Prabhas @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/gCg0M7edni