Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్ - అప్పుడే ఆ బాలీవుడ్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసిందిగా
Kalki 2898 AD Box Office Collections: ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’.. ఎన్నో సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా రెండు బాలీవుడ్ చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Kalki 2898 AD World Wide Box Office Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదలయ్యి కరెక్ట్‌గా రెండు వారాలు అవుతోంది. అయినా ఈ సినిమాకు క్రియేట్ అయిన హైప్ ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ మూవీని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ మూవీ. తాజాగా సినిమా విడుదలయ్యి రెండు వారాలు పూర్తి చేసుకోగా.. ఒక హిందీ సినిమా కలెక్షన్స్‌కు సంబంధించిన రికార్డ్ కూడా బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ‘కల్కి 2898 ఏడీ’.
ఆ మూవీతో పోటీ..
గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సైలెంట్‌గా బ్లాక్‌బస్టర్ సాధించిన చిత్రాల్లో ‘గదర్ 2’ కూడా ఒకటి. సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ విషయంలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ విడుదలయిన రెండు వారాల్లోనే ‘గదర్ 2’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేయడం విశేషం. దేశవ్యాప్తంగా ‘గదర్ 2’.. రూ.525.7 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ విడుదలయిన రెండు వారాల్లోనే రూ.536.75 కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా ఇంకా పలు థియేటర్లలో ఈ సినిమా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది.
దేశవ్యాప్తంగా ఎంతంటే..?
‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించిన ఎక్కువ కలెక్షన్స్ తెలుగు, హిందీ బాక్సాఫీస్ నుండే వస్తున్నాయని సమాచారం. తెలుగులో ఇప్పటివరకు రూ.252.1 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. హిందీలో రూ.229.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక ఇతర సౌత్ భాషల విషయానికొస్తే.. తమిళంలో రూ.31.55 కోట్లు, కన్నడలో రూ.19.65 కోట్లు, మలయాళంలో రూ.4.4 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్‌పై మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఇంకా ‘కల్కి 2898 ఏడీ’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అందుకే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ.. రూ.900 కోట్ల మార్క్‌ను టచ్ చేసి రూ.1000 కోట్ల మార్క్ వైపుకు దూసుకెళ్తోంది.
మరో వారం..
‘గదర్ 2’ మాత్రమే కాదు ‘యానిమల్’ కలెక్షన్స్‌ను కూడా దాటేసింది ‘కల్కి 2898 ఏడీ’. పైగా ఇంకొక వారం వరకు థియేటర్లలో ఈ సినిమా హైప్ ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా ఇలాగే స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్.. కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా దిశా పటానీ నటించగా మరొక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అలరించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. అప్పుడే దీని సీక్వెల్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టారు.
Also Read: భారతీయుడు 2 టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్, కానీ కొన్ని కండిషన్స్