అన్వేషించండి

Kaliveera In Telugu : తెలుగులోకి కన్నడ 'కలివీరుడు' - 'కాంతార'లా సక్సెస్ కొడతాడా?

కన్నడ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీనికి కారణం 'కెజియఫ్', 'కాంతార' సినిమాలే అని చెప్పాలి. ఇప్పుడు 'కాంతార' కోవలో కన్నడ సినిమా ఒకటి తెలుగులోకి వస్తోంది.

ఇప్పుడు కన్నడ సినిమా (Kannada Cinema) కాలర్ ఎగరేసి మరీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందు నిలబడుతోంది. కన్నడ సినిమా వైపు ప్రేక్షకుల చూపు కూడా పడుతోంది. రాక్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన 'కెజియఫ్' రెండు భాగాలు, సుదీప్ 'విక్రాంత్ రోణ', రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమాలు అని చెప్పాలి. 

ముఖ్యంగా మన మట్టి కథలకు ప్రేక్షకులు ఎంత విలువ ఇస్తారు? అనేది అందరికీ చెప్పిన సినిమా 'కాంతార'. తొలుత కర్ణాటకలో విడుదలైన ఆ సినిమా, ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదమై... పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. 'కాంతార'లో తాను బాల్యంలో చూసిన సంప్రదాయాల్ని రిషబ్ శెట్టి చూపించారు. 'కలివీరుడు' సినిమా కూడా ఆ తరహా చిత్రమే అని ఎం. అచ్చిబాబు చెబుతున్నారు. 

తెలుగులోకి 'కలివీరుడు'గా...
కన్నడ చిత్ర పరిశ్రమలో రియల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులతో పేరు పొందిన నటుడు ఏకలవ్య (Kannada Hero Ekalavyaa). ఆయన కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'కలివీర'. ది ఇండియన్ వారియర్... అనేది ఉపశీర్షిక. అవిరామ్ రచన, దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

'కలివీర'ను తెలుగులో 'కలివీరుడు' (Kaliveerudu Telugu Movie) పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ పంపిణీదారుడు, మినిమం గ్యారంటీ మూవీస్ అధినేత ఎం. అచ్చిబాబు సొంతం చేసుకున్నారు. తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 

'కలివీరుడు' సినిమా గురించి ఎం. అచ్చిబాబు మాట్లాడుతూ ''కన్నడలో రూపొందిన ఈ సినిమా అక్కడ అనూహ్య విజయం సాధించింది. రికార్డు స్థాయి వసూళ్ళు సాధించింది. కన్నడలో కొత్త సినిమాకు అంత కలెక్షన్స్ రావడం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగులో కూడా సంచలన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. 'కలివీరుడు'గా రియల్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులకు పెట్టింది పేరైన ఏకలవ్య అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన స్టంట్స్ ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు. 

జూలైలో 'కలివీరుడు' విడుదల!
Kaliveerudu Release In July : వచ్చే నెల (జూలై) ద్వితీయార్థంలో 'కలివీరుడు' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎం. అచ్చిబాబు చెప్పారు. 'కాంతార' తరహాలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగులోకి అనువాదం అవుతున్న మీడియం బడ్జెట్ కన్నడ సినిమాల లిస్టులో ఇప్పుడు 'కలివీరుడు' కూడా చేరింది. ఈ కోవలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్

'కలివీరుడు' సినిమాలో ఏకలవ్య సరసన చిరా శ్రీ కథానాయికగా నటించారు. ఇంకా ఈ సినిమాలో డేని కుట్టప్ప, తబలా నాని, అనితా భట్ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పోస్టర్స్ : విక్రమ్ ఎ.హెచ్ - అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం : హలేష్ ఎస్, కూర్పు : ఎ.ఆర్.కృష్ణ, నేపథ్య సంగీతం : రాఘవేంద్ర, నిర్మాత : ఎం. అచ్చిబాబు, రచన - దర్శకత్వం : అవి. 

Also Read ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

North Andhra Flash Floods: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన  ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన ప్రభుత్వం
Janasena Ram Talluri: జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
Pawan Kalyan: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Raju Gari Gadhi 4 Update: 'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
Advertisement

వీడియోలు

Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
BCCI vs PCB | Asia Cup 2025 | ఆసియా కప్ ట్రోఫీపై ముదురుతున్న వివాదం
India vs Sri Lanka Women World Cup | శ్రీలంకపై భారత్ విజయం
Asia Cup 2025 Ind vs Pak Controversy | ఆసియాక‌ప్ కాంట్రవర్సీపై మాజీ క్రికెట‌ర్ ఆవేద‌న‌
Women World Cup 2025 | Smriti Mandhana | ట్రోల్స్ ఎదుర్కొంటున్న స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
North Andhra Flash Floods: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన  ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన ప్రభుత్వం
Janasena Ram Talluri: జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
Pawan Kalyan: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Raju Gari Gadhi 4 Update: 'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
Kantara Chapter 1 OTT: 'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే!
'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే!
Vilaya Thandavam: 'పుష్ప' కేశవాకు మరో ఛాన్స్... కార్తీక్ రాజు 'విలయ తాండవం'లో!
'పుష్ప' కేశవాకు మరో ఛాన్స్... కార్తీక్ రాజు 'విలయ తాండవం'లో!
AP Police Jobs : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 11 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 11 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు!
Nayanthara: 'మహాశక్తి'గా నయనతార - దసరా స్పెషల్... 'మూకుత్తి అమ్మన్ 2' లుక్ రిలీజ్...
'మహాశక్తి'గా నయనతార - దసరా స్పెషల్... 'మూకుత్తి అమ్మన్ 2' లుక్ రిలీజ్...
Embed widget