Rihanna Baby Bump: బేబీ బంప్ సీక్రెట్ కాదు సూపర్ ట్రెండ్, మాతృత్వపు మాధుర్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న తారలు

పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని, గర్భవతి అని తెలిస్తే ఆఫర్స్ ఆగిపోతాయని సెలబ్రిటీలు భయపడేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి చేసుకుంటున్నారు, తమ ప్రెగ్నెన్సీ గురించి ధైర్యంగా చెబుతున్నారు.

FOLLOW US: 

మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. అయితే, అది ఇన్నాళ్లు నాలుగు గోడలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కొంతమంది ఆ విషయాన్ని దాచిమరీ షూటింగ్స్‌లో పాల్గొనేవారు. అయితే, అదంతా ఒకప్పుడు. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీలు తమ మాతృత్వపు మాధుర్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కాజల్ నుంచి ప్రణీత వరకు తమ బేబీ బంప్‌ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. 

ఒకప్పుడు సెలబ్రిటీస్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్లను చూశాం. ఒకవేళ పెళ్ళైతే వాళ్లకు పిల్లలు పుట్టి మళ్ళీ బ్యాక్ to షేప్ అండ్ ఫిట్ అయ్యేవరకు సోషల్ మీడియాకు దూరంగా వుండేవాళ్ళు. ప్రెగ్నెన్సీలో ఎలా ఉండేవారనేది సీక్రెట్‌గా ఉంచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరే. ఇటీవల కాజల్ తన ప్రెగ్నెన్సీ ఫొటోలను పోస్ట్ చేసినప్పుడు.. కొందరు బాడీ షేమింగ్ చేశారు. వారికి కాజల్ గట్టిగా సమాధానం చెప్పింది. ఒక మహిళ తల్లిగా మారినప్పుడు శరీరంలో కలిగే మార్పులు, ఆ తల్లి ఎదుర్కొనే పరిస్థితుల గురించి వివరించి కళ్లు తెరిపించింది. ఆ తర్వాత కూడా తన ప్రెగ్నెన్సీ అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంది. 

ఇప్పుడు సెలబ్రిటీస్ పెళ్లి ఘనంగా చేసుకొని, పర్సనల్ అకౌంట్‌లో ఫొటోస్ గ్రాండ్‌గా ఎలా షేర్ చేస్తున్నారో.. అంతే ఆర్భాటంగా ప్రెగ్నెన్సీ పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు. డే వన్ నుంచి బేబీ పుట్టిన డే వరకు అన్ని ఎక్స్పీరియన్సెస్‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్ళై పిల్లలు పుడితే బాడీ షేమింగ్ చేస్తారేమో, ఆఫర్స్ రావేమో అనే ట్రెండ్ నుంచి, పెళ్ళైనా పిల్లలు పుట్టినా.. ఆఫర్స్‌లో మాత్రం దూసుకెళ్తున్నారు. పెళ్లి పిల్లలు కెరీర్‌కు అడ్డు కాదని ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తమ బేబీ బంప్స్‌ను అందంగా చూపిస్తూ, గ్రేట్ ఈవెంట్స్ కూడా వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

టాలీవుడ్‌లో తాజాగా బేబీ బాయ్‌కు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ నుంచి హాలీవుడ్‌ పాప్ సంచలనం రిహన్నా వరకు ఇలాంటి స్టోరిసే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ నయా బేబీ బంప్ ట్రెండ్ ఎంతగా ఉందంటే, మెట్ గలాలో పాప్ సింగర్ రిహన్నా రాలేక పోయినా కూడా ఆమె షో స్టీల్ చేసేసింది. ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ రిహన్నా బేబీ బంప్‌తో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచింది. 

Also Read: ‘అనసూయ అదే పదాన్ని వాడితే నవ్వారు? విశ్వక్‌సేన్ అంటే సీన్ చేస్తున్నారు, హరీష్ శంకర్ ఫైర్!
 
గతంలో అనుష్క శర్మ, సింగర్ శ్రేయ ఘోషల్, కరీనా కపూర్, శ్రీయ, నేహా ధూపియా, సోనమ్ కపూర్ కూడా తమ బేబీ బంప్స్ తో ఫొటోస్ పెట్టి వేలల్లో లైక్స్ దోచేస్తున్నారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆసనాలు చేస్తే శరీరానికి మంచిదో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ జనాలకి బాగా ఎక్కినట్టుంది. బుల్లితెర తారలతో పాటు చాలా మంది పెళ్లికి ప్రొఫషనల్ ఫొటోగ్రాఫ్స్ ఎలా తీస్తున్నారో అలాగే బేబీ బంప్ ఫోటో షూట్ కూడా గ్రాండ్‌గా చేస్తున్నారు. మొత్తానికి అభిమానులకైతే ఈ నయా ట్రెండ్ తెగ నచ్చేసింది. ప్రెగ్నెన్సీ గ్యాప్‌లో సినిమాలకు దూరంగా వున్నా ఇలా సోషల్ మీడియా ద్వారా దగ్గరగా ఉండడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?

Published at : 06 May 2022 11:26 AM (IST) Tags: Body shaming Kajal Aggarwal baby bump Rihanna Baby Bump Rihanna Baby Bump Trend Rihanna Baby Bump Trend Maternity Trend

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!