అన్వేషించండి

Kajal Aggarwal: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ క్యారవాన్‌కు వచ్చి అలా చేశాడు - చాలా భయపడ్డాను, కాజల్‌కు చేదు అనుభవం..

Kajal Aggarwal: హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. షూటింగ్‌ తర్వాత అతను నేరుగా తన క్యారవాన్‌ వచ్చి షర్ట్‌ విప్పాడంటూ భయానక సంఘటనను గుర్తు చేసుకుంది.

Kajal Aggarwal Remember a Shocking Incident from Fan: హీరోహీరోయిన్లకు స్టార్‌ డమ్‌ వచ్చేది అభిమానుల వల్లే. ఎంతమంది అభిమానులుంటే అంత స్టార్‌డమ్‌ ఉంటుంది. అయితే ఒక్కొసారి అదే అభిమానుల వల్ల చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు. ఎలాంటి ఈవెంట్స్‌ అయినా, షూటింగ్స్‌లో అభిమానుల అత్యుత్సాహం వల్ల చేదు అనుభవాలు ఎదుర్కొంటారు. అభిమానం పేరుతో అనుచితంగా ప్రవర్తించి హీరోయిన్లను ఇబ్బంది పెడుతుంటారు.

Kajal Aggarwal About Shocking Incident: ఇక కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇలాంటి అనుభవాలు పలుమార్లు ఎదురైన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ జ్యూవెల్లర్‌ షాప్ ఒపెనింగ్‌కి వెళ్లిన కాజల్‌కి షాకింగ్‌ సంఘటన ఎదురైంది. సెల్ఫీ దిగేందుకు వచ్చి నడుముపై చేయి వేయబోయాడు. అయితే తనకే షూటింగ్‌లోనే అలాంటి ఒక అనుభవం ఎదురైంది చెప్పింది కాజల్‌. తన మూవీ సత్యభామ రిలీజైన సందర్భంగా కాజల్ ఇటీవల మీడియాతో ముచ్చటించింది.  ఈ సందర్భంగా తన మూవీ విశేషాలు పంచుకున్న ఆమె షూటింగ్ లో తనకు ఎదురై ఓ భయానక సంఘటనను గుర్తు చేసుకుంది.  ఈ ఇంటర్య్వూలోఆమె మాట్లాడుతూ ఓ వ్యక్తి చేసిన పనికి భయంతో వణికిపోయానని చెప్పింది. 

అప్పుడు నేను ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. అది మొదటి రోజు షూటింగ్‌. షాట్‌ అయిపోయాక నేను నా క్యారవాన్‌లో వెళ్లి కూర్చున్న. అప్పుడు నాతో ఎవరూ లేరు. ఒక్కదాన్నే ఉన్నాను. సడెన్‌ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఓ వ్యక్తి క్యారవాన్‌ లోపలికి వచ్చాడు. అతడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌. లోపలికి రాగానే షర్ట్‌ విప్పి తన ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని అతడికి వివరించాను. ఇంకేప్పుడు ఇలా చేయకూడదని కూడా స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇటీవల సత్యభామ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కాజల్‌కు జోడిగా నవీన్‌ చంద్ర నటించాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్వకత్వం వహించాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూస్ చేశారు. మరోవైపు కాజల్‌  కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఇండియన్‌ 2' (Indian 2 Release Date) మూవీలో నటిస్తుంది. ఇందులో కమల్‌ హాసన్‌కు జోడి కట్టింది ఈ చందమామ. ఈ సినిమా జూలై 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి రేపు ఫస్ట్‌ సింగిల్‌ విడుదల కానుంది.

Also Read: మా అమ్మనాన్న విడాకులు తీసుకోలేదు - సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర జయరామ్‌ కూతురు, భర్త ఎమోషనల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Crime News: ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
Viral News: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Embed widget