Bharateeyudu 2: నిన్న ‘ఆచార్య’, నేడు ‘భారతీయుడు 2’, కాజల్‌కే ఎందుకు ఇలా జరుగుతోంది!
కాజల్ అగర్వాల్ కు దిగ్గజ దర్శకుడు శంకర్ షాక్ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ సినిమాలో ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నా.. తను ఇందులో కనిపించదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Kajal In ‘Bharateeyudu 2’: విశ్వ నటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భారతీయుడు 2’. ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీల పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్.. ఈ చిత్రంలో కాజల్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాజల్ కు దర్శకుడు శంకర్ షాక్
‘భారతీయుడు 2’లో మెయిన్ హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నా, కానీ ఈ చిత్రంలో ఆమె కనిపించదని దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఆ సమయంలో ఆమెను ఆడియెన్స్ కూడా గుర్తు పట్టలేరని చెప్పారు. ఈ సినిమా మొత్తం సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కమల్ హాసన్ చుట్టూనే తిరుగుతుందన్నారు. శంకర్ ఈ విషయం చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నా.. కాజల్ కనిపించకపోవడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు.
అందుకే.. ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదట!
నిజానికి కాజల్ ‘భారతీయుడు 2’ సినిమా కోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. గుర్రపు స్వారి, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. ఇంత కష్టపడ్డా, ఈ సినిమాలో ఆమె కనిపించకపోవడం పట్ల కాజల్ రియాక్షన్ ఏంటనేది తెలియదు. కానీ, ఆమె పార్ట్ 3లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘భారతీయుడు 2’లో కాజల్ మీద చిత్రీకరించిన సీన్లు అన్నీ పార్ట్ 3లోనే పెట్టేలా దర్శకుడు నిర్ణయం తీసుకున్నారట. అందుకే, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదని తెలుస్తోంది.
‘ఆచార్య’ సినిమాలోనూ కనిపించని కాజల్
‘భారతీయుడు 2’లోనే కాదు, గతంలో ‘ఆచార్య’ విషయంలోనూ ఇలాగే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ మీద చాలా సీన్లు షూట్ చేశారు. కానీ, ఏం జరిగిందో తెలియదు గానీ, ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ మొత్తాన్ని తొలగించారు. ఇప్పుడు ‘భారతీయుడు 2’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది.
కాజల్ గత రెండు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తోంది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరం అయ్యింది. ఓ బాబు కూడా పుట్టాడు. రీసెంట్ గా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమె, గత ఏడాది బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా ‘సత్యభామ’ సినిమాలో పోలీస్ అధికారిగా నటించి మెప్పించింది. ‘భారతీయుడు 2’తో ప్రేక్షకులను అలరించాలి అనుకున్న కాజల్ కు దర్శకుడు శంకర్ షాక్ ఇచ్చారు.
Read Also: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా