Jr NTR: తారక్ ఖతర్నాక్ లైనప్ - 15 నెలల్లో 3 సినిమాలు, ప్రభాస్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉన్నాడే!?
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రాబోయే 15 నెలల్లోనే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.
Jr NTR Upcoming Movies: టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నలుగురు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నాడు. అయితే వీరిలో ప్రభాస్ ఒక్కడే సూపర్బ్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోడమే కాదు, వీలైనంత తర్వాత షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాలను విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆసక్తికరమైన లైనప్ తో ప్రభాస్ కు కాంపిటీషన్ ఇస్తున్నాడు.
2018లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్తిగా RRR సినిమాకు అంకితమయ్యారు. ఈ మూవీ విడుదలైన దగ్గర నుంచీ 'దేవర' మీదనే వర్క్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని డేట్స్ హిందీలో 'వార్ 2' చిత్రానికి కేటాయించారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ నీల్ తో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
'NTR Neel' అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల సినిమా ముస్తాబవుతోంది. దీనికి 'డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో డీటెయిల్స్ ను బట్టి ఇది 1969 గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనే ప్రచారం మొదలైంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందించే ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రఫీ వ్యవహరించనున్నారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ పూజ చేసిన రోజే ప్రకటించారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'దేవర' సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'దేవర పార్ట్-1' ను 2024 సెప్టెంబర్ 27వ తేదీన భారీ స్ధాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 'వార్ 2' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు తారక్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఆగస్ట్ 15న విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.
'డ్రాగన్' మూవీ రిలీజ్ కు చాలా టైం ఉంది కాబట్టి, ఎన్టీఆర్ ముందుగా 'వార్ 2' షూటింగ్ ఫినిష్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాల చిత్రీకరణ జరిగే విధాన్ని బట్టే 'దేవర 2' ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఆధారపడి ఉంటుంది. ఎలా చూసుకున్నా రాబోయే ఏడాదిన్నర కాలంలో తారక్ నుంచి 3 లేదా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్క సినిమాలో కనిపించిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఇంత తక్కువ గ్యాప్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రావడం మెచ్చుకోదగ్గ విషయమే. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఒక్కడే వరుసగా సినిమాలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఆయనకు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.