Narne Nithin New Movie : అల్లు అరవింద్ సమర్పణలో ఎన్టీఆర్ బావమరిది హీరోగా
Jr NTR Brother In Law New Movie : జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది... పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ (Narne Nithin) కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభమైంది. హీరోగా ఆయనకు రెండో చిత్రమిది. ఆల్రెడీ ఓ సినిమా సెట్స్ మీద ఉంది.
అల్లు అరవింద్ సమర్పణలో నార్నే నితిన్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నార్నే నితిన్ రెండో సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రతిభావంతులైన కొత్త నటీనటులు, దర్శకులు, యువకులను ప్రోత్సహించడంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన జీఏ 2 పిక్చర్స్ (GA2 Pictures) ఎప్పుడూ ముందు ఉంటుంది. అల్లు అరవింద్ సమర్పణలో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ... వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత 'బన్నీ' వాస్. ఇప్పుడు ఎన్టీఆర్ బావమరిది హీరోగా సినిమా స్టార్ట్ చేశారు.
నార్నే నితిన్ కథానాయకుడిగా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రానికి 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు. ఇందులో నయన్ సారిక హీరోయిన్. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ గ్లాస్ హౌస్‌లో సినిమాకు పూజ చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా... చిత్ర సమర్పకులు, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర బృందానికి మారుతి స్క్రిప్ట్ అందించారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
View this post on Instagram
గోదావరి నేపథ్యంలో సినిమా!?
ఆల్రెడీ విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... గోదావరి లేదంటే పాపికొండల నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నారేమో అని అనిపిస్తోంది. గుడి కూడా సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో గుడి, ఆ వెనుక కొండలు ఆకట్టుకుంటున్నాయి.
Also Read : సాయి తేజ్ - చీటీల చిన్ని - అప్పులు, వసూళ్లు, నవ్వులు
జీఏ 2 పిక్చర్స్ సంస్థలో 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ప్రతి సినిమాలోనూ అయితే వినోదం లేదంటే కొత్త కంటెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందుకని, నార్నే నితిన్ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నే నితిన్ తొలి సినిమా 'శ్రీశ్రీశ్రీ రాజావారు' తెరకెక్కుతోంది.
Also Read : నితిన్ కు హ్యాండ్ ఇచ్చిన రష్మిక - కొత్త హీరోయిన్ వేటలో వెంకీ
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించనున్న ఈ చిత్రానికి కూర్పు : కోదాటి పవన్ కళ్యాణ్, కళా దర్శకత్వం : కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ : సుష్మిత, శిల్ప, ఛాయాగ్రహణం : సమీర్ కళ్యాణి, సంగీతం : రామ్ మిర్యాల, సహ నిర్మాత : ఎస్.కె.ఎన్, నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్, నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, దర్శకత్వం: అంజిబాబు కంచిపల్లి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial