అన్వేషించండి

Jithender Reddy Movie : రూటు మార్చిన విరించి వర్మ - ఎవరీ 'జితేందర్ రెడ్డి'?

'ఉయ్యాలా జంపాలా'తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ, ఆ తర్వాత మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మజ్ను' తీశారు. ఒక్కసారిగా ఆయన రూటు మార్చారు.

'ఉయ్యాలా జంపాలా' ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు పదేళ్ళు. ఆ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దర్శకుడు పరిచయం అయ్యారు. ఆయనే విరించి వర్మ (Virinchi Varma). ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు తీశారో తెలుసా? నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'మజ్ను' ఒక్కటే! 

పదేళ్ళలో విరించి వర్మ తీసిన చిత్రాలు రెండు అంటే రెండు మాత్రమే! అయినా సరే... ఆయనకు సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు తీశారని విరించి వర్మ పేరు తెచ్చుకున్నారు. అటువంటి దర్శకుడు ఒక్కసారిగా రూటు మార్చారు. ఇప్పుడు ఆయన ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. 

విరించి వర్మ దర్శకత్వంలో 'జితేందర్‌ రెడ్డి'!
Virinchi Varma New Movie : ఇటీవల విరించి వర్మ దర్శకుడిగా ఓ సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమా టైటిల్ 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy Movie). స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌.... (ప్రజలకు చెప్పాల్సిన కథ అని అర్థం) అనేది ఉప శీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అసలు ఎవరీ 'జితేందర్‌ రెడ్డి'?
'జితేందర్ రెడ్డి' చిత్రాన్ని అనౌన్స్ చేయడంతో పాటు సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో హీరో ఎవరు? అనేది రివీల్ చేయలేదు. కుర్చీలో ఓ నాయకుడు... ఆయన పక్కన ఓ పాప... ముందు కొంత మంది ప్రజలు... ఇదొక నాయకుని కథ అని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే క్లారిటీ వచ్చింది. 

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో జితేందర్ రెడ్డి పేరుతో ఓ నాయకుడు ఉన్నారు. ఆయన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ కూడా! అయితే... ఇది ఆయన కథ కాదు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి, ఈ 'జితేందర్ రెడ్డి' ఎవరు? ఆయన కథ ఏమిటి? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ 'జితేందర్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కథా నేపథ్యం ఈ సినిమాపై ఆసక్తి పెంచడానికి ఓ కారణం అయితే... ప్రేమ కథలతో ఫేమస్‌ అయిన విరించి వర్మ ఒక్కసారిగా రూటు మార్చి, రాజకీయ నేపథ్యంలో ఓ నాయకుడి బయోపిక్ ఎంపిక చేసుకోవడం మరో కారణం. ఆయన పొలిటికల్ బేస్డ్ స్టోరీ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఈ సినిమాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది. 

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!

'జితేందర్ రెడ్డి' కాన్సెప్ట్ పోస్టర్ ప్రముఖ దర్శకులు దేవా కట్టా చేతుల మీదుగా విడుదల చేశారు. ముదుగంటి క్రియేషన్స్‌ పతాకంపై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విఎస్‌ జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలుగులోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నాగేంద్ర కుమార్‌ కళా దర్శకుడు. 

Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో దర్శకుడిగా మారిన నిర్మాత - తెర వెనుక ఏం జరిగింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget