Sudheer Babu Jatadhara Day 2 Collection : సుధీర్ బాబు 'జటాధర' కలెక్షన్స్ - ఫస్ట్ డేతో పోలిస్తే...
Jatadhara 2 Days Collection : యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన 'జటాధర' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల కలెక్షన్స్ ఓసారి చూస్తే..

Sudheer Babu's Jatadhara First Two Days Collection : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ బాబు గత చిత్రాలను చూసిన ఆడియన్స్ పూర్ క్వాలిటీ మూవీ చేశారంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇక క్రిటిక్ రివ్యూయర్స్ సైతం మూవీకి రేటింగ్స్ తక్కువ ఇచ్చారు.
రెండు రోజుల కలెక్షన్స్
ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే 'జటాధర' అనుకున్నంత రీచ్ కాలేకపోయింది. తొలి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.2.91 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.1.07 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా... తెలుగులో రూ.85 లక్షలు, హిందీలో రూ.22 లక్షలు వచ్చాయి. సుధీర్ గత సినిమాలతో పోలిస్తే ఈ కలెక్షన్స్ తక్కువే అని తెలుస్తోంది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్స్‌పై ప్రభావం పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
View this post on Instagram
Also Read : ముంబయిలో కూల్... వైజాగ్‌లో ట్రెడిషనల్ - ఆమె నుంచి తెలుగు నేర్చుకోవాలి... శోభితపై చై ప్రశంసలు
మూవీలో ఘోస్ట్ హంటర్‌గా హీరో సుధీర్ బాబు కనిపించగా... ధన పిశాచిగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ, శుభలేఖ సుధాకర్, రైన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహించగా... జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. గుప్త నిధులు, ధన పిశాచి బంధనాలు, డివోషనల్ అంశాలతో మూవీని తెరకెక్కించారు.





















