అన్వేషించండి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ క్యూట్ తెలుగు స్పీచ్ - 'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఇలా...

Devara Pre Release Event: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంతో వెయిట్ చేసింది. కానీ, ఫంక్షన్ జరగలేదు. దాంతో అక్కడ చెప్పాలనుకున్న మాటలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Janhvi Kapoor On Devara Pre Release Event: శ్రీదేవి అందం, నటన మెచ్చిన తెలుగు ప్రేక్షకులు ఆమెను ముద్దుగా అతిలోక సుందరి అని పిలిచేవారు. తెలుగు తెరపై వెలుగు వెలిగిన కథానాయక శ్రీదేవి. 'దేవర' సినిమాతో ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. 

తెలుగులో తొలి సినిమా 'దేవర' విడుదలకు ముందు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు ఫ్యాన్స్ క్లబ్బులు ఏర్పడ్డాయి. జాను పాప అని కొందరు... నయా అతిలోక సుందరి అని మరికొందరు జాన్వీని ముద్దుగా పిలుస్తున్నారు. వాళ్లతో 'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడాలని అనుకుంది. అందుకోసం జాన్వీ కపూర్ ఎంతో ప్రిపేర్ అయింది. కానీ, ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. దాంతో ఆవిడ ఏం చేసిందంటే...

తెలుగులో జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్
Janhvi Kapoor Speaking Telugu: ''అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతో స్వాగతించిన, నా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు... నన్ను జాను పాప అని ముద్దుగా పిలుస్తున్న ఎన్టీఆర్ గారి అభిమానులకు... మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరంతా నన్ను సొంత మనిషిలా భావించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు... మా అమ్మకు కూడా మీరు అందరూ ఎంతో ముఖ్యం. అలాగే నాకు కూడా! నన్ను ఇంత ఇలా సపోర్ట్ చేస్తున్న మీరు అందరూ గర్వపడేలా నేను ప్రతి రోజూ కష్టపడతాను. తెలుగులో దేవర నా తొలి అడుగు. దర్శకుడు కొరటాల శివ గారు... ఎన్టీఆర్ గారు నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గారు, చైతన్య అక్క... వీళ్ళ అందరితో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను'' అని తెలుగులో జాన్వీ కపూర్ మాట్లాడారు.

Also Readకుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్‌ అయ్యాక రచ్చ రచ్చ


'దేవర' ఫంక్షన్ కోసం పదహారేళ్ల తెలుగు పడుచులా లంగా వోణీలో ముస్తాబు అయ్యారు జాన్వీ కపూర్. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ''నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామని అనుకున్నాను. కానీ ఈసారి కి అలా కుదరలేదు. మిమ్మల్ని అందరిని త్వరలోనే కలుస్తానని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు చిన్న మెసేజ్'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జాన్వి. తెలుగులో ముద్దు ముద్దుగా ఆవిడే మాట్లాడిన మాటలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.

Also Readబ్రేకింగ్ న్యూస్... 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ - మెయిన్ రీజన్స్ ఇవే

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

సెప్టెంబర్ 27న 'దేవర' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. దీని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget