Rajini Kanth: ‘ముత్తువేల్ పాండియన్’గా సూపర్ స్టార్ - ‘జైలర్’ ఫస్ట్‌లుక్ వీడియో చూశారా?
రజినీ కాంత్ ‘జైలర్’ ఫస్ట్ లుక్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు.
![Rajini Kanth: ‘ముత్తువేల్ పాండియన్’గా సూపర్ స్టార్ - ‘జైలర్’ ఫస్ట్‌లుక్ వీడియో చూశారా? Jailer First Look Video Released on Occasion of Super Star Rajini Kanth Birthday Rajini Kanth: ‘ముత్తువేల్ పాండియన్’గా సూపర్ స్టార్ - ‘జైలర్’ ఫస్ట్‌లుక్ వీడియో చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/5d1194aa3823fc3e7ee23a63fb2a7a351670851627853252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘జైలర్’ ఫస్ట్‌లుక్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో రజినీకాంత్ ‘జైలర్’గా కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో జరిగే కథ ఇది అని వార్తలు వస్తున్నాయి. ‘కోకో కోకిల’, ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘జైలర్’లో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత రజనీతో రమ్యకృష్ణ
'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటించనున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో పలు హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర ముందు వరుసలో ఉంటుంది. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో ఆవిడ సినిమా చేస్తున్నారు.
తమన్నా కూడానా?
'జైలర్' సినిమాలో తమన్నా భాటియా కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఆ విషయాన్ని చిత్ర బృందం కన్ఫర్మ్ చేయలేదు. రజనీతో కూడా తమన్నా ఇంత వరకు నటించలేదు. ఒకవేళ ఈ సినిమా కన్ఫర్మ్ అయితే రజనీ - తమన్నా కలయికలో ఇదే తొలి సినిమా అవుతుంది.
#Jailer - #MuthuvelPandian Arrives 🔥🔥🔥https://t.co/0HBq1WVJ1V
— Anirudh Ravichander (@anirudhofficial) December 12, 2022
Happy Birthday Thalaiva, One n Only Superstar @rajinikanth 🥳🥳🥳@Nelsondilpkumar @sunpictures @NimmaShivanna @meramyakrishnan @KVijayKartik @iamvasanthravi @Nirmalcuts @iYogiBabu #Vinayakan
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)