Jabardasth Faima: రూ.500 అప్పు చేశా, చచ్చిపోతానని బెదిరించాకే అమ్మ అందుకు ఒప్పుకుంది - ‘జబర్దస్త్’ ఫైమ
Jabardasth Faima: ఒక షోలో గెస్ట్‌గా వచ్చి, తర్వాత అందులోనే కామెడియన్ అయ్యింది ఫైమా. ప్రస్తుతం ఫైమా పంచులకు ఒక రేంజ్‌లో పాపులారిటీ ఉంది. కానీ ఇంతవరకు తాను ఎలా వచ్చిందో తాజాగా బయటపెట్టింది.
Jabardasth Faima: ఒక స్టాండప్ షోలో కేవలం గెస్ట్‌గా వచ్చి, కాసేపు తన కామెడీతోనే అందరినీ ఇంప్రెస్ చేసి అదే ఛానెల్‌లో కామెడియన్‌గా మారిపోయింది ఫైమా. ‘పటాస్’లో గెస్ట్‌గా వచ్చిన తను.. ఆ తర్వాత అదే షోలో కామెడియన్‌గా మారి స్టాండప్ కామెడీ చేసింది. ఇప్పుడు ‘జబర్దస్త్’లో తన పంచులతో అందరినీ ఆకట్టుకుంటోంది. మధ్యలో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి కూడా అలరించింది. ప్రస్తుతం ఫైమాకంటూ ఒక ఫేమ్ ఉంది. అయితే ‘పటాస్’లో కామెడియన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు తన ఇంట్లో ఎలా ఒప్పించిందో తాజాగా బయటపెట్టింది ఈ ‘జబర్దస్త్’ భామ. సినిమాల్లో ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చింది.
అప్పు చేసి వచ్చాను..
‘‘నేను పటాస్‌కు వెళ్లేవరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, ఆ షో గురించి కూడా నాకు తెలియదు. పటాస్ యాజమాన్యం కొంతమంది స్టూడెంట్స్‌ను ఆడియన్స్‌లాగా తీసుకురమ్మని మా కాలేజ్ వాళ్లకు చెప్పారు. ఒక్కొక్క స్టూడెంట్‌కు రూ.500 ఛార్జ్ చేసి ఒక పిక్నిక్‌లాగా ఆ షోకు తీసుకెళ్లారు. అప్పుడు నా దగ్గర రూ.500 కూడా లేవు. మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా ఇప్పటికీ తీర్చలేదు’’ అని ‘పటాస్’కు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది ఫైమా. ఇక షోలో అవకాశం వచ్చిన తర్వాత ఇంట్లోవారిని ఎలా ఒప్పించిందో బయటపెట్టింది. ‘‘ఒక ప్రోమో వల్ల ఇంత హైప్ వచ్చిందంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా అని అమ్మకు చెప్పాను. హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు అని అమ్మ వద్దంది’’ అని చెప్పుకొచ్చింది.
సెట్ అవ్వలేదు..
‘‘వాళ్లు ఒప్పుకోలేదని రెండు రోజులు అన్నం తినలేదు. అంటే వాళ్ల ముందు తినలేదు. వాళ్లు బయటికి వెళ్లినప్పుడు తినేదాన్ని. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. నేను ఏడిస్తే తట్టుకోలేడు. ఆయన బయట దేశంలో ఉండేవారు. ఆయన కూడా ముందు ఒప్పుకోలేదు. వెంటనే రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టేసుకొని చచ్చిపోతాను అన్నాను. అమ్మ భయపడి ఒప్పుకుంది’’ అని వివరించింది ఫైమా. ఇక ‘పటాస్’కు రాకముందు హాస్పిటల్‌లో నర్స్‌లాగా, స్కూల్‌లో టీచర్‌లాగా, టైలర్‌లాగా పనిచేశానని, కానీ ఏదీ సెట్ అవ్వలేదని బయటపెట్టింది. ముందుగా ‘పటాస్’లోకి వచ్చినప్పుడు కూడా తనకు యాక్టింగ్ రాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ చాలా సాయం చేశారని గుర్తుచేసుకుంది.
సినిమా అవకాశాలు వచ్చాయి..
సినిమాల్లో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఒప్పుకున్నాను. ముందు నాది చాలా పెద్ద క్యారెక్టర్ అన్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే అమ్మ, నాన్నకు థియేటర్‌కు తీసుకెళ్లి చూపిస్తా అని ఏదేదో ఊహించేసుకున్నాను. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు డైలాగ్సే లేవు. 10 రోజులు షూటింగ్ అన్నారు కానీ రెండు రోజులకే పంపించేశారు. నేను ఏదైనా పాత్ర చేస్తే ప్రేక్షకులు మెచ్చుకునేలాగా ఉండాలి. ఖాళీగా నిలబడిందేంటి అని అనుకోకూడదు. అలా పాపులర్ హీరోలతో మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కానీ 45 రోజుల పాటు షూటింగ్ పూర్తయ్యేవరకు హైదరాబాద్ రామన్నారు. కానీ మధ్యలో నాకు జబర్దస్త్ షూటింగ్స్ ఉంటాయని నేనే వద్దన్నాను. ఏదైనా వదులుకుంటాను కానీ జబర్దస్త్‌ను మాత్రం వదులుకోను’’ అని తెలిపింది ఫైమా.
Also Read: బాత్రూమ్ వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతెలా - అంటే.. ఇందులో ఆమె ప్రమేయం లేదా?