Samantha in Pushpa 2: 'పుష్ప 2' మరో సాలిడ్ అప్‌డేట్ - పార్ట్ 2లో సమంత అతిథి పాత్ర, ఈసారి ఐటెం సాంగ్ కాదట!
Samantha:'పుష్ప 2'లో సమంత కూడా నటిస్తుందంటూ తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. పార్ట్ 1లోని పాత్రకు కొనసాగింపు పార్ట్ 2లో ఉంటుందని, మూవీ చివరిలో ఆమె తళుక్కున మెరుస్తుందంటూ ప్రచారం జరుగుతుంది.
Samantha Cameo in Pushpa 2?: టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో పుష్ప 2పై మరిన్ని అంచనాలు పెంచుతూ తరచూ ఏదోక అప్‌డేట్ వస్తుంది. ఇప్పటికే 'పుష్ప'కు పార్ట్ 3 పై స్వయంగా అల్లు అర్జున్ (Allu Arjun) హింట్ ఇచ్చాడు. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నన ఆయన.. అక్కడ ఓ ఇంగ్లిష్ చానల్‌తో మాట్లాడుతూ 'పుష్ప'ని ఫ్రాంచైజ్ చేయాలనుకుంటున్నామని, ఈ సినిమాకు పార్ట్ 3కి ఉండోచ్చు అంటూ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు.
ఇది చూసి మూవీ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా 'పుష్ప 2'కి సంబంధించిన మరో సాలిడ్ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 'పుష్ప 2'లో సమంత (Samantha) కూడా నటిస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో కామియో రోల్ చేయబోతుందట.. 'పుష్ప 2' మూవీ చివరిలో కొన్ని క్షణాలు కనిపిస్తుదంటూ ప్రచారం జరుగుతుంది. అదే 'పుష్ప 3'లో కొనసాగింపు అవుతుందంటూ తాజాగా ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సమంత అతిథి పాత్ర.. పార్ట్ 3లో కూడా
Samantha In Pushpa 3 Also: తొలి పార్ట్ లాగే పుష్ప 2లోనూ సమంత ఐటెం సాంగ్ చేస్తుందంటూ మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవి నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు సమంతను గెస్ట్ రోల్‌లో చూపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఆమె మూవీ సినిమా చివరిలో లేదా చిన్న సాంగ్ బిట్‌లో కొన్ని క్షణాలు కనిపిస్తుందట. లేదంటే పార్ట్ 1లో ఆమె చేసిన పాత్రను రెండవ భాగంలో కొనసాగించాలని చూస్తున్నారట. చివరిగా కొద్దిక్షణాల్లో కనిపించే ఆమె చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే సమంత పాత్రకు మూడో భాగంగా ఎక్కువ స్కోప్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది విని సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే 'పుష్ప' టీం ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Also Read: 'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ - ఫస్ట్‌డే అన్ని కోట్లా? ఊహించిన దానికంటే ఎక్కువే రాబట్టిందిగా!
అయితే పుష్పను ఫ్రాంచైజీలో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని, కానీ, ఇది వెంటనే సాధ్యం కాదని రీసెంట్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పుష్ప 3 కూడా రావచ్చని హింట్ ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే సమంత పుష్ప 2 నటిస్తుందేమో అని మూవీ లవర్స అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సమంత కామియో రోల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తందో చూడాలి. ఇదిలా ఉంటే సమంత నటించి ఐటెంలో సాంగ్‌ను పార్ట్ 2లో దిశా పటాని చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.