అన్వేషించండి

Fact Check:  అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? నిజమెంతంటే!

Prabhas Donation to Ram Mandir: ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే  చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా 'డార్లింగ్‌' గురించే మాట్లాడుకుంటున్నారు.

Prabhas Donates 50 Crore to Ram Mandir: ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే  చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా 'డార్లింగ్‌' గురించే మాట్లాడుకుంటున్నారు. జనవరి 22న జరిగే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్‌ రూ. 50 కోట్లు విరాళం ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసిన దీనిపైనే చర్చ జరుగుతుంది. ఎందుకుంటే దీనిపై ఇప్పటి వరకు ప్రభాస్‌ కానీ ఆయన టీం నుంచి కానీ విరాళం ఇచ్చినట్టు ఎక్కడ అధికారిక ప్రకటన లేదు. దీంతో ప్రభాస్‌ విరాళం ఇచ్చారా? లేదా? అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం.

ఈ క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. నిజానికి ఇప్పటి వరకు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు అసలు ఆహ్వానమే అందలేదట. ఈ విషయం షాకిస్తున్న అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అసలు ఆహ్వానమే అందని ప్రభాస్‌ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం రోజున అందించే ఆహార ఖర్చులను చూసుకునేందుకు ముందుకు వచ్చాడంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కామెంట్స్‌తో ప్రభాస్‌ అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ రూమర్లకు చెక్‌ పెట్టెందుకు తాజాగా ప్రభాస్‌ టీం స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామమందిరం కోసం ప్రభాస్‌ ఎలాంటి విరాళం ఇవ్వలేదని, అంతేకాదు ఎలాంటి ఆహార ఖర్చులు చూసుకుంటానని ఆయన మాట కూడా ఇవ్వలేదని ఓ బాలీవుడ్‌ మీడియాకు వెల్లడించినట్టు మరో వార్త బయటకు వచ్చింది.

ప్రభాస్ కు అందని ఆహ్వానం

కాగా మరో మూడు రోజుల్లో జరిగే అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. అయితే ఇందులో ప్రభాస్‌ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. మరి చివరిక వరకైనా ప్రభాస్‌కు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే నవరి 22న మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు ఆలయంలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అలాగేఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్‌ ద్వారా దాదాపు 7 వేల మందికి పైగా ఆహ్వానం అందినట్లు సమాచారం.

కాగా ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి రాజా సాబ్‌, నాగ్‌ అశ్విన్‌ కల్కి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల మారుతి చిత్రం 'రాజా సాబ్‌' నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హారర్‌ అండ్‌ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్టు ఇటీవల టీం పేర్కొంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి AD 2898 అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget