VN2 : నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి పవర్ ఫుల్ టైటిల్!
VN2 : నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి 'రాబిన్ హుడ్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Intresting Tittle For Nithin - Venky Kudumula Movie : లవర్ బాయ్ నితిన్ కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నితిన్ అర్జెంటుగా ఓ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు 'భీష్మ'తో భారీ సక్సెస్ అందించిన వెంకీ కుడుములనే మరోసారి నమ్ముకున్నాడు.
'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' తర్వాత నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'భీష్మ' ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు నితిన్ కి సక్సెస్ రాలేదు. దాంతో ఈసారి ఎలాగైనా భీష్మ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు నితిన్- వెంకీ రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే సినిమా ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు. జనవరి 26న ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది.
అదేంటంటే, నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన 'రాబిన్ హుడ్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. దొంగతనాల నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాకి 'రాబిన్ హుడ్' అనే టైటిల్ సరిగ్గా సూట్ అవుతుందనే ఉద్దేశంతో మూవీ టీం ఇదే టైటిల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ లో భాగంగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 'గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలో దోచుకునే సీజన్ మొదలు అవుతుంది. జనవరి 26న ఉదయం 11.07 గంటలకు మోసగాడి ముఖాన్ని మీకు చూపిస్తాం' అని పేర్కొనడంతో ఈ సినిమా రాబరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అర్థమైపోయింది.
మరి ఈ సినిమాతో నైనా నితిన్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె కంటే ముందు నేషనల్ రష్మిక మందనను ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యే సమయానికి రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దానికి రీజన్ ఏంటో తెలియదు కానీ రష్మిక తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో శ్రీలీలని తీసుకున్నారు. నితిన్ తో శ్రీలీల చేస్తున్న రెండో సినిమా ఇది. రీసెంట్ గానే ఈ ఇద్దరూ కలిసి 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో నటించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Also Read : జెట్ స్పీడ్‌లో 'మిస్టర్ బచ్చబ్' షూటింగ్ - నయా షెడ్యూల్ కోసం అక్కడికెళ్లిన మూవీ టీమ్