Child Artist Become Lawyer: చిరంజీవి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్ద లాయర్ - ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా?
Tollywood Child Artist: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా?. ఒకప్పుడ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అల్లరి చేసింది. తన ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో అలరించింది.
Megastar 'Jai Chiranjeeva' Movie Child Artist: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా?. ఒకప్పుడ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అల్లరి చేసింది. తన ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో అలరించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే మేనకోడలుగా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఇప్పటికైన ఆమె ఎవరో తెలిసిపోయిందనుకంటా. అవును 'జై చిరంజీవ' సినిమాలో చిరుని 'మావయ్య.. మావయ్య' అని పిలిచింది ఈ అమ్మాయే. తన పేరు శ్రియా శర్మ. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి ఆ తర్వాత హీరోయిన్‌గానూ తన లక్‌ను పరిక్షించుకుంది. కానీ అవి వర్క్‌అవుట్ కాలేదు. ఆమె హీరోయిన్‌గా రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో ఇక నటన పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టింది.
గుర్తుపట్టేలేనంతగా..
ఇప్పుడు పెద్ద లాయర్ అయ్యింది. ప్రస్తుతం శ్రియా ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. రీసెంట్‌గా లాయర్ పట్ట పొందినట్టుగా శ్రియా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అయితే సినిమాల్లో స్లమ్‌గా కనిపించిన ఆమె ఇప్పడు కాస్తా బొద్దుగా గుర్తుపట్టనట్టుగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. సినిమాలకు దూరమైన శ్రియా ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడుందో చూద్దాం. నిజానికి శ్రియా శర్మది హిమాచల్ ప్రదేశ్. అక్కడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి వికాస్ శర్మ ఇంజనీర్. తల్లి రితు న్యూట్రిషియనిస్ట్. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమె ఐ.సి.ఎస్.ఈ పదో తరగతి లో 91 శాతం ఉత్తిర్ణత, సీ.బీ.ఎస్.ఈ పన్నెండో తరగతిలో 95 శాతం మార్కులు సాధించింది.
ప్రస్తుతం 26 ఏళ్ల శ్రియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రముఖ కార్పోరేట్ కంపెనీలకు అడ్వెకట్‌గా వ్యవహరిస్తుందని సమాచారం. కాగా ఆమె తీరు చూస్తుంటే శ్రియా శర్మ ఇక పూర్తిగా సినిమాలకు దూరమైనట్టు అనిపిస్తుంది. కాగా మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఎనలేని గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా వరుసగా ఆఫర్లు అందుకుంది. నువ్వు నేను ప్రేమ మూవీలో నటించిన ఆమె తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ బాలనటిగా అలరించింది. హిందీలో ఆమె నటించిన 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక తెలుగులో మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు అందుకుంది. టీనేజ్ గర్ల్, వింటెజ్ హీరోయిన్ల రోల్స్ ఆకట్టుకుంది.
మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లెలి పాత్రలో నటించి శ్రియా.. ఆ తర్వాత రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనుస వంటి సినిమాల్లో టీనేజ్ అమ్మాయిగా కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా రెండు సినిమాలు చేసింది. గాయకుడు మూవీతో హీరోయిన్‌గా మారిన ఆమె ఈ చిత్రంలో బిగ్‌బాస్ అలీ రేజా సరసన నటించింది. తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా ఈ మూవీ శ్రియా నిరాశ పరిచింది. ఆ తర్వాత శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో నిర్మలా కాన్వెంట్ మూవీలో చేసి మరోసారి లక్‌ను పరీక్షించుకుంది. కానీ ఇది కూడా డిజాస్టర్ కావడంతో ఇక శ్రియా నటనకు బై చెప్పి హైయ్యర్ స్టడిస్ చేసింది. న్యాయవిద్యలో పట్టా పొందిన ఆమె ప్రస్తుతం నార్త్‌లోని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు లాయర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.