అన్వేషించండి

ఇండ్రస్ట్రీలోని డైరెక్టర్లు నన్ను మిస్ గైడ్ చేసి వాడుకున్నారు: పాయల్ రాజ్ పుత్

టాలీవుడ్ హీరోయిన్, RX100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు సంచలన నిజాలను బయటపెట్టింది.

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని పేరు కొందరికి మాత్రం ఒకే ఒక సినిమాతో వస్తుంది. అంటే ఓకే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం అన్నమాట. అలా ఒకే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మొదటి సినిమాలోనే నటనతో పాటు తన అందాన్ని ఓ రేంజ్ లో ఆరబోయడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. దీంతో పాయల్ రాజ్ పుత్ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ అవకాశాలు ఏమి పాయల్ కి గుర్తింపును తేలేకపోయాయి.

కథల ఎంపికలో చేసిన తప్పు వల్లనో, లేక సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్లనో.. పాయల్ స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. అయితే తాజాగా 'మాయాపేటిక', 'మంగళవారం' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హాట్ హీరోయిన్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పలు సంచలన నిజాలు బయటపెట్టింది. ఏకంగా తనను ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'మాయా పేటిక' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. "తన తొలి సినిమా తర్వాత హైదరాబాదులో ఒంటరిగా ఉండేదాన్ని. ఈ క్రమంలోనే కొంతమంది దర్శకులు తనని మిస్ గైడ్  చేశారు’’ అని చెప్పుకొచ్చింది.

"నేను ఏ సినిమాకైనా వందకి రెండు వందల శాతం ఎఫర్ట్స్ పెడతాను. కానీ ఆ సినిమాలు వర్కౌట్ అవడం, కాకపోవడం నా చేతుల్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది". తన తొలి సినిమా తర్వాత కొంతమంది దర్శకులు మిస్ గైడ్ చేయడం వల్లే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, మరికొందరు తనని అడ్వాంటేజ్ గా తీసుకోగా.. ఆ విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాల్లో తనకి పూర్తి మెచ్యూరిటీ వచ్చిందని తెలిపింది. దీంతో ప్రస్తుతం పాయల్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం తనకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తోనే మరో సినిమా చేస్తుంది పాయల్.

'మంగళవారం' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ పోషిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా అజయ్ భూపతి గత చిత్రం 'మహాసముద్రం' భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శర్వానంద్, సిద్ధార్థ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత 'మంగళవారం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. మరి ఈ సినిమాతో నైనా ఈ దర్శకుడు సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Also Read : ఓ మై గాడ్, తమన్నాను మించిపోయిన శోభిత - ‘ది నైట్ మేనేజర్-2’లో ఆ లవ్ సీన్ వైరల్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget