Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Allu Cinemas : దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అల్లు సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌తో దీన్ని ప్రారంభించనున్నారు.

Allu Cinemas Largest Dolby Screen To Launch In Hyderabad : హైదరాబాద్ వాసులకు, మూవీ లవర్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇప్పటికే బ్యూటిఫుల్ విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఐమాక్స్ వంటి బిగ్ స్క్రీన్స్ అందుబాటులో ఉండగా మరో బిగ్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ ప్రేక్షకుల కోసం భాగ్యనగరంలో ప్రారంభం కాబోతోంది.
ప్రత్యేకతలివే?
అల్లు సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్‌ను డాల్బీ సినిమాస్ ప్రారంభించనుంది. ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు కలిగి ఉండనుండగా... DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో ఉంటుంది. 3D ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యుత్తమ 'DolbyVision'తో పాటు 'Dolby3D' ప్రొటక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం 'DolbyAtmos' సౌండ్ సిస్టమ్ యాడ్ చేసినట్లు చెప్పారు.
ఆడియన్స్‌కు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అద్భుతమైన సౌండ్, సౌకర్యవంతంగా వీక్షించేందుకు 'పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నారు. సినీ ప్రపంచంలో ప్రేక్షకులను పూర్తిగా లీనం చేసేలా డాల్బీ స్క్రీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Also Read : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
హాలీవుడ్ విజువల్ వండర్‌తో...
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీతో ఈ డాల్బీ స్క్రీన్ ప్రారంభించబోతున్నారు. ఈ నెల 19న మూవీ రిలీజ్ కానుండగా బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు డాల్బీ స్క్రీన్ రెడీ అవుతోంది. ఈ అద్భుత టెక్నాలజీని ఎంజాయ్ చేయాలంటే ఆడియన్స్ మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇప్పటికే భాగ్యనగర వాసులకు ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబీ సినిమాస్, ఎపిక్ స్క్రీన్స్ వంటి బిగ్ స్క్రీన్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మాస్ మహారాజ రవితేజ ఏఆర్‌టీ సినిమాస్ ఏర్పాటు చేశారు. ఇదే ఫస్ట్ ఎపిక్ స్క్రీన్ కావడం విశేషం. ఇప్పుడు దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ రాబోతోంది.





















