అన్వేషించండి

పిల్లాడిలా ఉన్నావ్, బాడీ పెంచినా సరిపోదన్నారు - అందుకే అలా చేశా: బాలీవుడ్ హీరో

ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచి ఫిజిక్ ఉన్న హీరోగా కనిపించేందుకు స్టెరాయిడ్స్ తీసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ కి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించాడు. మంచి ఫిజిక్ ఉన్న హీరోగా కనిపించేందుకు తాను స్టెరాయిడ్లు తీసుకున్నట్లు చెప్పడం షాకింగ్ గా మారింది. కెరియర్ స్టార్టింగ్ లో తనను చాలా మంది ఫిలిం మేకర్స్ 'నువ్వు మగాడిలా లేవు, పిల్లాడిలా ఉన్నావ్.. హీరోయిన్ల నీకంటే పెద్దగా కనిపిస్తున్నారు' అని కామెంట్స్ చేశారని దాంతో బాడీ పెంచడంపై దృష్టి సారించానని అందులో భాగంగానే బాడీ పెరగడం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు వెల్లడించాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసహిట్లతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత కాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి దూరమయ్యాడు.

జెనీలియాతో కలిసి 'జానే తూయ జానే నా' మూవీ తో పాటు 'ఢిల్లీ బెల్లీ', 'ఐ హేట్ లవ్ స్టోరీస్', 'మేరే బ్రదర్ కి దుల్హన్' వంటి సినిమాల్లో నటించాడు. బాలీవుడ్ లో హీరో అంటే కచ్చితంగా కండలు తిరిగిన బాడీ ఉండాలి. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా సాధారణంగా బక్కపలుచగా కనిపించే ఇమ్రాన్ ఖాన్ ను మొదట్లో చాలా మంది అసలు హీరోగా అంగీకరించలేదట. 'నువ్వు అసలు మగాడిలానే లేవు, పిల్లాడిలా ఉన్నావ్ హీరోయిన్లు నీకంటే పెద్దగా కనిపిస్తారు' అనే కామెంట్స్ తో ఎంతో ఇబ్బంది పడిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత బాడీ పెంచడానికి ఎంతో కసరత్తులు చేశారట.

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ 2008లో 'జానీ తు యా జానే నా' సినిమాతో బాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. అప్పటికే సన్నగా ఉండడంతో తొలి సినిమా మొత్తం రెండు లేయర్ల దుస్తులు వేసుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత చేసిన కిడ్నాప్ మూవీ సమయానికి కాస్త జిమ్ కి వెళ్లి కండలు పెంచినా, అది కూడా సరిపోలేదని అన్నాడు.

" తొలి సినిమా తర్వాత కొన్ని నెలపాటు నా బాడీని పెంచడంపై దృష్టి సారించాను. జిమ్ లో గంటల తరబడి చెమటోడ్చాను. అయినా కూడా ఇంకాస్త బాడీ పెంచు అని చాలామంది ఫిలిం మేకర్స్ అనేవారు. నువ్వు చాలా వీక్ గా ఉన్నావ్. మగాడిలా లేవు, పిల్లాడిలా ఉన్నావ్. హీరోయిన్లే నీ కంటే పెద్దగా కనిపిస్తారు అనే కామెంట్స్ కూడా చేశారు. దాంతో స్టెరాయిడ్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ కామెంట్స్ నన్ను అభద్రతాభావంలోకి నెట్టేసాయి. శక్తివంతమైన హీరోలాంటి ఫిజిక్ కావాలని భావించాను" అని అన్నాడు.

" పోషకాహారం తినకుండా కసరత్తులు చేయడం వేస్ట్. రోజుకు ఆరుసార్లు 4 వేల కేలరీలు తినేవాడిని. చికెన్ బ్రెస్ట్, ఎగ్ ఫైట్స్, స్వీట్ పొటాటో, ఓట్స్, అవిసె గింజలు ఇవన్నీ తినేవాడ్ని. అయినా కూడా నా బైసెప్స్ అంతగా వృద్ధి చెందలేదు. దాంతో స్టెరాయిడ్ల వైపు చూసాను " అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇమ్రాన్ ఖాన్. దీంతో ఈ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇమ్రాన్ ఖాన్ చివరగా 2015 లో వచ్చిన 'కట్టిబట్టి' సినిమాలో నటించాడు. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

Also Read : ‘దేవర’ సెట్స్​లో ఎన్టీఆర్‌, సైఫ్‌ యాక్షన్ సీక్వెన్స్ షూట్.. ఇది సినిమాకే హైలెట్ అట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget