అన్వేషించండి

Ileana: 'బర్ఫీ' హిట్‌తో సౌత్‌ ఇండస్ట్రీకి దూరమయ్యా - ఆ దర్శకనిర్మాత వల్లే తెలుగులో ఆఫర్స్‌ రాలేదు

Ileana About South Offers: టాలీవుడ్‌ల ఆఫర్స్‌ రాకపోవడంపై ఇలియాన షాకింగ్‌ విషయం చెప్పింది. బర్ఫీ సినిమా హిట్‌తో వల్లే తను సౌత్‌ ఇండస్ట్రీ దూరమయ్యానంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది.

Ileana Said She Lost Tollywood Offers After Bollywood Debut: కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు మైఖేల్‌ డోలన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె గతేడాది ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తల్లయిన తర్వాత ఇలియాన మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు నుంచి మూడు సినిమాలు ఉన్నాయి.  ఈ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మైఖేల్‌తో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇంతకాలం మైఖేల్‌తో రిలేషన్‌ సీక్రెట్‌గా ఉంచిన ఆమె అతడిని పెళ్లి చేసుకున్నట్టు స్పష్టం చేసింది.

'బర్ఫీ' హిట్ తో తెలుగు ఆఫర్స్ కరువయ్యాయి

అనంతరం తన ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి కూడా చెప్పుకొచ్చింది. తన బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'బర్ఫీ' తర్వాత ఆమె సౌత్‌ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఆమె బాలీవుడ్ ఎంట్రీ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా ఇంటర్య్వూలో సౌత్‌లో సినిమా అవకాశాలు తగ్గడంపై ఇలియానా స్పందించింది. దక్షిణాది దర్శక-నిర్మాతల వల్లే తనకు సౌత్‌లో అవకాశాలు రాలేదని చెప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "2012లో అనురాగ్‌ బసు దర్శకత్వం వహించిన 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌ అడుగుపెట్టాను. అప్పటికే సౌత్‌లో చాలా సినిమాలు చేస్తున్నాను. అదే టైంలో అనురాగ్ బసు నాకు బర్ఫీ స్ప్రిప్ట్‌ వినిపించారు. కథ నచ్చడంతో ఆ సినిమాను వదులుకోవాలి అనిపించలేదు. దీంతో బర్ఫీ' ఒకే చేసి సినిమా కూడా చేశాను. మూవీ సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో ఇక నేను సౌత్‌ సినిమాలు చేయననుకున్నారు.

నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. 

ఇక నేను బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయిపోయానని భావించి అక్కడ నన్ను పట్టించుకోవడం మానేశారు. అందుకే దర్శక-నిర్మాతలు నా పట్ల ఆసక్తి చూపించలేదు. కానీ, నేనేప్పుడు దక్షిణాది ఇక సినిమాలు చేయకూడదని అనుకోలేదు. ఎందుకంటే నాకు గుర్తింపు ఇచ్చింది ఆ ఇండస్ట్రీ. నా వరకు నేను ఏ సినిమా అయినా నిజాయితీగా చేశాను. అది టాలీవుడ్‌ అయినా బాలీవుడ్‌ అయినా. కానీ, నాకు మాత్రం ఆశించిన గుర్తింపు మాత్రం రాలేదు. మరీ నా విషయంలో వారు ఎందుకలా అనుకున్నారో ఇప్పటికీ నాకూ స్పష్టత లేని విషయం" అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇలియానా రామ్‌ పోతినేని 'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి మూవీతోనే మంచి హిట్‌ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో ఇలియానా తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.

తనదైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో దర్శక-నిర్మాతలను కూడా ఆకట్టుకుంటుంది. దాంతో ఇలియానా వరుస ఆఫర్స్‌తో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుంది. స్టార్‌ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఇక్కడ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే బర్ఫీ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అదే ఆమెను సౌత్‌లో అవకాశాలు తగ్గేలా చేసిందనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. ఇప్పుడు ఇలియానా కూడా అదే చెప్పడం గమనార్హం. ఇక దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్‌ తర్వాత ఇలియానా 'అమర్‌ అక్భర్‌ ఆంటోనీ' చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇక తల్లైన ఆమె ఇప్పుడు హిందీలో 'దో ఔర్ దో ప్యార్', 'తేరా క్యా హోగా లవ్లీ' వంటి సినిమాలు చేస్తుంది. మరి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అయినా తెలుగులో ఆఫర్స్‌ అందుకుంటుందో లేదో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget