మైత్రీ మూవీ మేకర్స్‌పై జీఎస్టీ అధికారులు గురి- ఏక కాలంలో 15 ప్రాంతాల్లో దాడులు
మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌లు, ఓనర్ నివాసాలపై జీఎస్టీ అధికారులు రైడ్ చేశారు. ఏక కాలంలో పదిహేను చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌పై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఏకంగా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ స్థాపించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు సినిమాను వీళ్లు మొదట నిర్మించారు. రెండో సినిమా కూడా కొరటాల శివ దర్శకత్వంలోనే చేశారు. అదే జనతాగ్యారేజ్. మూడో సినిమాగా రంగస్థలం వచ్చింది. ప్రస్తుతం వాళ్లు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, పుష్ప-2, ఉస్తాద్ భగత్‌సింగ్ నిర్మిస్తున్నారు. ఇందులో రెండు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇంకొకటి సెట్స్‌పై ఉంది. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ నిన్న(ఆదివారం) పూజాకార్యక్రమాలను పూర్తి చేసుకుంది.