Venky Re-Release: రీరిలీజ్‌కు సిద్ధమైన రవితేజ, స్నేహల ‘వెంకీ’ మూవీ!
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ, స్నేహ జంటగా నటించిన వెంకీ రీరిలీజ్ కాబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. 2004లో రిలీజైన ఈ మూవీ.. రీరిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..
Venky Re-Release : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ల హవా సాగుతోంది. ఇప్పటికే రీరిలీజైన పలు సినిమాలు మరోసారి మంచి కలెక్షన్లు కూడా రాబట్టాయి. అయితే గత కొన్ని రోజులుగా ఓ సినిమాను కూడా రీరిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రేక్షకుల తరపున బాగా వినిపిస్తోంది. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటైన 'వెంకీ' సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో పట్టుబడుతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఆ సినిమాలోని కామెడీ సన్నివేశాలు నేటికీ మీమ్స్ ద్వారా ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. 'వెంకీ' సినిమాను ఆడియెన్స్ కోరినట్టు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
'వెంకీ' సినిమాకు ఇప్పటికే రీ-రిలీజ్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. వెంకీని రీరిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించడం ఖాయమని రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ, హీరోయిన్ స్నేహ జంటగా నటించిన 'వెంకీ' సినిమా 2004లో రిలీజైంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ ఏడాదిలో మార్చి 26న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'వెంకీ' అప్పట్లో కమర్షియల్‌గా మంచి హిట్ ను నమోదు చేసింది. కామెడీ కింగ్స్ రవితేజ, బ్రహ్మానందంల కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు.
ఇటీవలే 'రావణాసుర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ... ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా హిట్ ను అందుకోలేకపోయింది. ఇందులో రవితేజ విలనిజంతో అదరగొట్టారు. ఇక ఈ సినిమాలో రవితేజ నెగటివ్ గా కనిపించడానికి కారణం కూడా అర్థం కాదు. సినిమా స్టోరీ అర్థం అవకపోవడంతో ప్రేక్షకులు తికమకపడుతారు. అయితే, రవితేజ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' లాంటి భారీ విజయాలతో ‘హ్యాట్రిక్’ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ ప్రస్తుతం నాలుగో సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక ఈ మూవీ నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లో ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, దేవాలయం, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Prabhas Salary: ‘సలార్’ మూవీకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, పైగా లాభాల్లో వాటా కూడానట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial