అన్వేషించండి

Varun Tej : ఆ సినిమా కోసం వరుణ్ తేజ్.. తన పెళ్ళినే వాయిదా వేసుకున్నాడా?

Varun Tej : 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌లో ఈతరంలో ఉన్న హీరోల్లో రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ విభిన్న తరహా సినిమాలు చేసే వారిలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా తాను ఒక కంప్లీట్ యాక్టర్ అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ మెగా హీరో. అలాంటి ప్రయత్నంలో భాగంగా చేసిన మరో సినిమానే 'ఆపరేషన్ వాలెంటైన్'.

భారత వైమానిక దాడులకు సంబంధించి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైమానిక దాడులు దేశభక్తి కలబోతగా రూపొందిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మార్చి 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వరుణ్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సినిమా కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నా- వరుణ్ తేజ్

'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా కోసం వరుణ్ తేజ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ టైం లోనే వరుణ్, లావణ్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఇదే విషయం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ.."ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్‌ను నిజమైన ఎయిర్ బేస్ లో చేశాం. అక్కడికి సెల్ ఫోన్స్ అనుమతించరు. ఉదయం 8 గంటల వరకు మొత్తం టీం అక్కడ ఉండేవాళ్ళం. అక్కడి అధికారులు చెప్పిన కొన్ని ఆపరేషన్స్ గురించి విని స్ఫూర్తి పొందాను. షూటింగ్ పూర్తి అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని, పెళ్లి వల్ల సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఉద్దేశంతో ముందుగా అనుకున్న తేదీని కాదని మరో ముహూర్తాన్ని పెట్టించాం" అని తెలిపాడు.

'ఆపరేషన్ వాలెంటైన్'తో బాలీవుడ్ ఎంట్రీ

ఈమధ్య మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో నటిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ సైతం 'ఆపరేషన్ వాలెంటైన్'తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. మెగా హీరోల్లో రామ్ చరణ్ గతంలో 'జంజీర్' సినిమాతో బాలీవుడ్‌కు ఆరంగేట్రం చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్లకు మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. మరి చరణ్ లాగా కాకుండా 'ఆపరేషన్ వాలెంటైన్' తో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

2019లో ఫిబ్రవరీ 14న ఇండియన్ ఆర్మీపై జరిగిన పుల్వామా అటాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఆరోజు ఆర్మీపై జరిగిన అటాక్‌కు సమాధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ల‌లోకి చొరబడి వారి క్యాంప్‌లపై దాడి చేసి గట్టి సమాధానమే చెప్పింది. ఆ ఘటనలో ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేసింది అనే అంశాన్ని 'ఆపరేషన్ వాలెంటైన్'లో స్పష్టంగా చూపించబోతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : శర్వానంద్ సినిమాలో యాంగ్రీ మ్యాన్ - ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించనున్న సీనియర్ హీరో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Vivo X200 Pro: దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget