అన్వేషించండి

Koi Mil Gaya: హృతిక్ రోషన్ కల్ట్ క్లాసిక్ 'కోయి మిల్ గయా' రీ రిలీజ్ - ఎప్పుడంటే?

హృతిక్ రోషన్ హీరోగా అతని తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

హృతిక్ రోషన్ హీరోగా అతని తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమా బాలీవుడ్ లో ఓ కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. 2003వ సంవత్సరంలో ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆగస్టు 8, 2023 నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఇండియాలోని 30 ప్రధాన నగరాల్లోని PVR ఐనాక్స్ లో ఆగస్టు 4న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదల చేసి ప్రేక్షకులో మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు రాకేష్ రోషన్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ 'కోయి మిల్ గయా రీరిలీజ్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ రోషన్ మాట్లాడుతూ.." కోయి మిల్ గయా మూవీకి సంబంధించి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పివిఆర్ ఐనాక్స్ బృందం మమ్మల్ని సంప్రదించింది. ఇక సినిమా రీరిలీజ్ కు సంబంధించి వాళ్ల దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ గురించి తెలిసి సంతోషించాను. పివిఆర్ బృందంతో కలిసి మేము ఈ సినిమాని ఆగస్టు 4న భారతదేశంలోని 30 ప్రధాన నగరాల్లో రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పివిఆర్ ఐనాక్స్ సినిమాల్లో మళ్లీ విడుదల విడుదల చేయబోతున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను సినిమా హాళ్లకు తీసుకెళ్లి ఈ కొత్త తరానికి పరిచయం చేస్తూ 20 ఏళ్ల క్రితం సినిమా చూసిన జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ పేర్కొన్నారు. 'కోయి మిల్ గయా' సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారనే విషయం అధికారికంగా తెలియజేయడంతో బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక 'కోయి మిల్ గయా' సినిమా విషయానికొస్తే.. హృతిక్ రోషన్, ప్రీతి జింటా, రేఖ, హన్సిక తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించగా.. అతని సోదరుడు రాజేష్ రోషన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2003 ఆగస్టు 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ గా పలు బాలీవుడ్ అవార్డ్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్స్ గా 'క్రిష్' అండ్ 'క్రిష్ 3' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు కూడా బాలీవుడ్లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ 'వార్ 2' సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Also Read : ‘కొటేషన్ గ్యాంగ్’ ట్రైలర్ - ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌‌ను మించిపోయిన ప్రియమణి, సన్నీలియోన్ ముఠా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget