అన్వేషించండి

Baahubali Crown Of Blood Trailer: 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' ట్రైలర్ - ఈ కొత్త సిరీస్‌లో కట్టప్ప విలన్‌‌, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Baahubali Crown Of Blood Trailer: బాహుబలి సినిమాను సరికొత్త వెర్షన్‌లో యానిమేటెడ్‌ సిరీస్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

Baahubali Crown Of Blood Trailer Released: దర్శక-ధీరుడు రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి తెలుగు పాన్‌ ఇండియా మూవీ 'బాహుబలి'. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈసినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ వసూళ్లు సునామి సృష్టించింది. మన తెలుగు సినిమాను ఇంటర్నేషనల్‌‌ వైడ్‌గా పరిచయం చేసిన చిత్రమిది. ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో 'బాహుబలి' ఓ హిస్టరీ క్రియేట్‌ చేసిందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమను శాసిస్తున్న'పాన్‌ ఇండియా' ట్రెండ్‌ ఈ సినిమాతోనే మొదలైంది.

వరల్డ్‌ వైడ్‌గా 'బాహుబలి' సంచలనమే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 2000 కోట్లపైనే గ్రాస్‌ వసూళ్లు చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ కూడా 'బాహుబలి'నే. ఇక మూవీ వచ్చి ఐదేళ్లు గడిచిన ఇప్పటికే బాహుబలి క్రేజ్‌ అలాగే ఉంది. ఈ క్రమంలో డైరెక్టర్‌ రాజమౌళి బాహుబలిని మళ్లీ తీసుకువస్తున్నాడు. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 'బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్'‌ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. యానిమేటెడ్ సిరీస్‌గా బాహుబలిని తీసుకురాబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఆఫీషియల్‌ ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. హిందీ భాషలో విడుదల చేసిన ఈ ట్రైలర్‌ ఆసక్తిని పెంచుతుంది.

ఈ కొత్త సిరీస్‌ ద్వారా సినిమాలో చూపించిన కథకు ముందు ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. జక్కన్న తెరకెక్కించిన ఆ బాహుబలిలో కట్టప్ప మాహిష్మతి సైన్యానికి అధిపతి అయితే ఈ సిరీస్‌లో మాహిష్మతి శత్రువు రాజ్యం సైన్యానికి కట్టప్పను అధిపతిగా చూపించారు. చూస్తుంటే ఈ సిరీస్‌లోనే కట్టప్ప విలన్‌ అని తెలుస్తోంది. బాహుబలితో జక్కన్న మాహిష్మతి రాజ్యాన్ని పరిచయం చేశారు. ఈ మాహిష్మతి రాజ్యంపై ముందుగా ఓ కొత్త శత్రువు దండయాత్రకు వస్తాడు. అతడే  రక్తదేవ్. అతని సైన్యానికి అధిపతి కట్టప్ప. తమకు శిక్షణ ఇచ్చిన కట్టప్పపై తమ సైన్యం ఎలా గెలవగలదా? అని నేరుగా బాహుబలి, భల్లాలదేవలే రంగంలోకి దిగుతారు.

యానిమేటెడ్‌గా వస్తున్న ఈ సీరీస్‌లో రక్తదేవ్‌ అనే కొత్త పాత్రను పరిచయం చేసి ఆసక్తి పెంచారు. సిరీస్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. తాజాగా ట్రైలర్‌ విడుదల చేస్తూ మే 17 నుంచి 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' రిలీజ్‌ చేయనున్నట్టు హాట్‌స్టార్‌ వెల్లడించింది. దీంతో ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కాగా ఆ బాహుబలికి రాజమౌళి దర్శకుడు కాగా ఈ యూనిమేటెడ్‌ సిరీస్‌ను ఆయన నిర్మాతగా ఉన్నారు. రాజమౌళి, దేవరాజన్ సృష్టించగా ఈ కథకు జీవన్ J. కాంగ్‌, నవీన్ జాన్‌లు దర్శకత్వం వహించారు. శోభుయార్లగడ్డతో కలిసి జక్కన్న, దేవరాజన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ బాహుబలి యానిమేటెడ్‌ సిరీస్‌ మే 17నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget