Honey Release Date: క్షుద్ర పూజలే కాదు... సైకాలజీతో భయపెడుతుందీ 'హానీ' - నవీన్ చంద్ర హారర్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడంటే?
Naveen Chandra's Honey Release: నవీన్ చంద్ర కథానాయకుడిగా 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ హారర్ సినిమా రూపొందుతోంది. ఆ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

తెలుగు చిత్రసీమలో ట్యాలెంటెడ్ యంగ్ హీరోల్లో నవీన్ చంద్ర (Naveen Chandra) ఒకరు. ఆయన ఒక వైపు కథానాయకుడిగా నటిస్తూ... మరొక వైపు విలన్ రోల్ కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేసే నవీన్ చంద్ర, ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
కరుణ కుమార్ దర్శకత్వంలో...
నవీన్ చంద్ర సైకలాజికల్ హారర్!
'పలాస 1978' గుర్తుందిగా! దర్శకుడిగా పరిచయమైన సినిమాతో తనదైన ముద్ర వేశారు కరుణ కుమార్. ఆ తర్వాత 'శ్రీదేవి సోడా సెంటర్' అంటూ మరొక హార్డ్ హిట్టింగ్ సినిమా చేశారు. ఇప్పుడు ఆయన జానర్ మార్చారు.
నవీన్ చంద్ర కథానాయకుడిగా 'హానీ' పేరుతో ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కిస్తున్నారు కరుణ కుమార్. అందులో నవీన్ చంద్ర సరసన మలయాళ భామ, 'మంగళవారం' ఫేమ్ దివ్య పిళ్లై నటిస్తున్నారు. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.
View this post on Instagram
విడుదలకు ముందు ఓటీటీ డీల్ క్లోజ్!
Honey Telugu Movie OTT: థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు 'హనీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడు అయ్యాయి. ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హానీ' రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
Honey Cast And Crew: నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై జంటగా నటిస్తున్న 'హానీ' సినిమాలో 'బిగ్ బాస్' దివి వడ్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: నగేష్ బన్నెల్, కూర్పు: మర్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు: రవి పీట్ల - ప్రవీణ్ కుమార్ రెడ్డి, రచన - దర్శకత్వం: కరుణ కుమార్.





















