HHVM Trailer - హరిహర వీరమల్లు: జూలై మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్... అప్డేట్ కాదు, అప్పట్నుంచి సెలబ్రేషన్స్ షురూ
Hari Hara Veera Mallu Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. వీరమల్లు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ సినిమా యూనిట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే డేట్ చెప్పింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్స్‌లో 'హరిహర వీరమల్లు' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఒకటి. జూన్ నుంచి జూలైకు సినిమా వెళ్ళిన తర్వాత పబ్లిసిటీ కార్యక్రమాలకు కాస్త బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పబ్లిసిటీ స్టార్ట్ చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది. ట్రైలర్ విడుదలతో మళ్లీ వీరమల్లు ప్రచారం మొదలు కానుంది.
జూలై 3న వీరమల్లు ట్రైలర్ విడుదల!
Hari Hara Veera Mallu Trailer Release Date Time Locked: జూలై 3న తేదీన ఉదయం 11:10 గంటలకు హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్ విడుదల చేయనున్నారు. జూలై 24న సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: రజనీకాంత్ 'కూలీ'కి ఐమాక్స్ స్క్రీన్స్ లేకుండా చేస్తున్న YRF... అక్కడ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాంటేజ్!?
This is not just the trailer update…⁰It’s a declaration of the hysteria that’s going to take over the next 25 days 🤗🤗🔥🔥#HHVMTrailer on July 3rd.#HariHaraVeeraMallu pic.twitter.com/ECxV1qGWl7
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 28, 2025
వీరమల్లు పాటలకు సూపర్ రెస్పాన్స్!
ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 'హరిహర వీరమల్లు' నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల అయ్యాయి అందులో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన 'మాట వినాలి'తో పాటు 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం', 'తార తార' ఉన్నాయి. పాటలు అన్నిటికీ మంచి స్పందన లభిస్తోంది. సాంగ్స్ హిట్ కావడం పట్ల సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
'హరిహర వీరమల్లు' సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం మీద ఎ దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి నుంచి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఏఎం జ్యోతి కృష్ణ సినిమాను భారీ స్థాయిలో సిద్ధం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు నటించిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస - జ్ఞానశేఖర్ విఎస్, కూర్పు: ప్రవీణ్ కెఎల్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి - చంద్రబోస్ - పెంచల్ దాస్, కళా దర్శకుడు: తోట తరణి, నృత్య దర్శకత్వం: బృందా - గణేష్, స్టంట్స్: శామ్ కౌశల్ - టోడర్ లాజారో జుజీ - రామ్ & లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ - విజయ్ మాస్టర్.





















