Nikhil: టాలీవుడ్‌లో హనుమంతుడి ట్రెండ్ - అదే బాటలో చిరంజీవి, నిఖిల్
Nikhil Siddharth: హీరో నిఖిల్.. తన అప్‌కమింగ్ మూవీ ‘స్వయంభు’ నుండి ఆసక్తికర అప్డేట్‌ను ఇచ్చాడు. ఇది చూసిన ప్రేక్షకులు.. నిఖిల్ కూడా టాలీవుడ్ హనుమంతుడి ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు.
Swayambhu Movie Update: ప్రస్తుతం టాలీవుడ్‌లో హనుమంతుడి ట్రెండ్ నడుస్తోంది. హనుమంతుడిని నమ్ముకుంటే సినిమా హిట్టే అని చాలామంది మేకర్స్ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పటికే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇందులో హీరో హనుమంతుడి భక్తుడిగా కనిపించాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న రెండు తెలుగు సినిమాల్లో కూడా హనుమంతుడి భక్తుడిగానే హీరోలు కనిపించడం విశేషం. అందులో ఒకరు సీనియర్ హీరో చిరంజీవి కాగా.. మరొకరు యంగ్ హీరో నిఖిల్. తాజాగా నిఖిల్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అప్‌కమింగ్ మూవీపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు.
‘స్వయంభు’ అప్డేట్..
‘కార్తికేయ 2’ సినిమా నిఖిల్ కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ బాక్సాఫీస్‌ను కూడా ఈ సినిమా షేక్ చేసింది. చాలాకాలం తర్వాత ఒక తెలుగు సినిమా.. హిందీ బాక్సాఫీస్‌లో తన సత్తా ఏంటో చాటుకుంది. ఇక ‘కార్తికేయ 2’ ఇచ్చిన జోష్‌తో తన తరువాతి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ చేతిలో దాదాపుగా మూడు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి ‘స్వయంభు’. చాలాకాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తూ షూటింగ్ ప్రారంభమయ్యిందని బయటపెట్టాడు నిఖిల్. ఇన్నాళ్ల తర్వాత ఈ మూవీ గురించి మరొక ఆసక్తికర అప్డేట్‌ను ఫ్యాన్స్‌కు అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి కూడా..
‘స్వయంభు కోసం నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తున్నాం. అనూహ్యంగా నేను సినిమాలో కూడా హనుమంతుడి భక్తుడినే. అద్భుతమైన సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నాం. ఈ దసరా, దీపావళికి థియేటర్లలో కలుద్దాం’ అంటూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్‌ను చూసిన ప్రేక్షకులంతా ‘హనుమాన్’లో కూడా హీరో.. హనుమంతుడి భక్తుడే అన్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. నిఖిల్, తేజ సజ్జా మాత్రమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ హనుమంతుడి భక్తుడి ట్రెండ్‌లో జాయిన్ అయ్యారు. తన అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’లో చిరు.. హనుమంతుడి భక్తుడు అని ఇటీవల విడుదలయిన టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
View this post on Instagram
అప్పుడు కృష్ణుడు.. ఇప్పుడు హనుమంతుడు..
నిఖిల్ చేసిన తాజా పోస్ట్‌కు నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అయితే దేవుడి పేరుతో సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టి దానినే సెంటిమెంట్‌లాగా ఫాలో అయిపోతున్నారని నెగిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. మరికొందరు అయితే నిఖిల్ ‘హనుమాన్’ మూవీకి ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా నిఖిల్‌కు దేవుడి సెంటిమెంట్ ఉన్న సినిమాలు బాగా కలిసొస్తున్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ‘కార్తికేయ 2’లో కృష్ణుడి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభు’ కథ కూడా తనకు హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిఖిల్ లైన్‌లో పెట్టుకున్న ప్యాన్ ఇండియా సినిమాలు అన్నీ హిట్ అయితే తన గ్రాఫ్ పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ‘విశ్వంభర’ కోసం కొత్త ప్రపంచం, అప్పుడు చిరంజీవి చిన్నపిల్లాడు అయిపోతారు - దర్శకుడు వశిష్ట