అన్వేషించండి

Kalki 2898 AD Collections: కలెక్షన్స్ విషయంలో ‘కల్కి 2898 ఏడీ’ జోరు - ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Box Office Collections: నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’.. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది.

Kalki 2898 AD World Wide Box Office Collections: ఒక సినిమాను సరిగా ప్రమోట్ చేసి, ఎక్కువమంది ప్రేక్షకులను రీచ్ అయ్యేలా చేస్తే కచ్చితంగా దానికి ఓపెనింగ్స్ బాగుంటాయి. అదే సినిమాను ప్రేక్షకులు చూసిన తర్వాత మౌత్ టాక్ బాగుంటే కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ పరిస్థితి కూడా అదే. ప్రీ బుకింగ్ దగ్గర నుండి, ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు అన్ని కోణాల్లో ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక విడుదలయిన వారం రోజుల్లోనే ఓ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టడంతో అసలు ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ సాధించిందో మేకర్స్ రివీల్ చేశారు.

పాజిటివ్ టాక్..

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’పై ప్రేక్షకుల్లో ముందు నుండే భారీగా అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సినిమాను ఫైనల్ చేశారు మేకర్స్. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికే చాలాకాలం పట్టింది. ఇక షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫైనల్‌గా మూవీ రిలీజ్ అవుతుంది అనుకున్న తర్వాత కూడా రెండుసార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. అలా అన్ని అడ్డంకులను దాటి జూన్ 27న ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బెనిఫిట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

రికార్డ్ స్థాయి కలెక్షన్స్..

‘కల్కి 2898 ఏడీ’ విడుదలయిన ఫస్ట్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక విడుదలయిన మొదటి వారం పూర్తయ్యే సమయానికి ‘కల్కి 2898 ఏడీ’.. రూ.800 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ మూవీ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే కచ్చింగా రూ.1000 కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా చాలా థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలు రన్ అవుతుండడంతో రూ.1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

యాక్టింగ్‌కు ఫిదా..

‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ హీరోగా నటించినా కూడా ఇందులో ఇతర నటీనటులు అందరూ కలిసి సినిమాను నిలబెట్టారని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందించారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ వయసులో ఆయన అలాంటి యాక్షన్ సీన్స్ చేయడం మామూలు విషయం కాదని ప్రశంసిస్తున్నారు. ఆయనతో పాటు కమల్ హాసన్ కూడా తన క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మిగతా స్టార్ల గెస్ట్ రోల్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి.

Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా బిడ్డ, ఆ సీన్ చేస్తున్నప్పుడు రణవీర్ అక్కడే ఉన్నాడు - నాగ్ అశ్విన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget