అన్వేషించండి

Actress Hema: నటి హేమకు రేవంత్ రెడ్డి, పవన్ అపాయింట్మెంట్ ఇస్తారా? సోషల్ మీడియాలో ఈ రిక్వెస్టులు ఏంది?

Hema In Rave Party: నటి హేమ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కోరారు. ఎటువంటి టెస్టులకు అయినా రెడీ అని సంచనల వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఆ కేసులో తెలుగు నటి హేమ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశంలో హేమ ఉండడం... తొలుత తాను అక్కడ లేనని ఆవిడ చెప్పడం, ఆ తర్వాత పోలీసులు ఆ ఫామ్ హౌస్ విజువల్స్ విడుదల చేయడం, ఆమెను విచారణకు రమ్మని నోటీసులు జారీ చేయడం వంటి విషయాలు ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే... హేమ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయగా ఆవిడ డ్రగ్ పాజిటివ్ అని తేలినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై హేమ స్పందించారు.

ఎటువంటి టెస్టులకు అయినా సరే సిద్ధం!
తాను ఎటువంటి టెస్టులు చేయించుకోవడానికి అయినా సరే సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియా వేదికగా హేమ ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడానికి కారణం తప్పు తన వైపు ఉండడం కాదని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆవిడ వివరించారు. ఈ సమయంలో తనపై మీడియాలో తీవ్ర దుష్ప్రచారం జరిగిందని, 35 ఏళ్లుగా తాను కూడగట్టుకున్న పరువును భూస్థాపితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు లేకుండా తనను ఇరికించారని వాపోయారు. వ్యక్తిగతంగా తాను బ్లడ్, హెయిర్ శాంపిల్స్ ఇచ్చి‌ టెస్టులు చేయించుకున్నానని... అన్నిటిలో నెగిటివ్ అని వచ్చిందని, ఇప్పుడు ఏమంటారని ఆవిడ ప్రశ్నించారు. అక్కడితో ఇష్యూ అవ్వలేదు. తనకు సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోరుతోంది. 

హేమకు రేవంత్ రెడ్డి, పవన్ అపాయింట్మెంట్ ఇస్తారా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తనకు కావాలని, అందుకు తన అభిమానులు కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా నటి హేమ విజ్ఞప్తి చేశారు. ఈ సోషల్ మీడియా రిక్వెస్టులు ఏందో చాలా మందికి అర్థం కావడం లేదు.

Also Readబ్లాక్ మెయిల్ చేశారు, సెటిల్‌మెంట్‌కు పిలిచారు... త్వరలో ఆ ఫోన్ నంబర్స్ బయటపెడతా - హేమ సంచలన వీడియో

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు గమనిస్తే సామాన్యుల నుంచి సైతం ఆయన చాలా విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. తనను కలవడానికి ఎవరైనా వెయిట్ చేస్తుంటే కాన్వాయ్ ఆపి మరీ కలుస్తున్నారు. హేమ ఆయనకు తెలియదని అనుకోవడానికి వీలులేదు. హేమ వెళితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే... ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు వచ్చినా కలుస్తున్నారు. సినిమాల గురించి రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చే మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన్ను కలిసే ప్రయత్నం హేమ చేశారో? లేదో? సోషల్ మీడియాలో రిక్వెస్ట్ మాత్రం చేశారు. 

హేమది రేవ్ పార్టీ, డ్రగ్ రిలేటెడ్ కేసు. డ్రగ్ కేసులో ఆవిడ పాజిటివ్ అని తేలిందా? లేదంటే నెగెటివ్ అని వచ్చిందా? అనేది ల్యాబ్ టెస్టులు, రిపోర్టులు తెలుస్తాయి. అయితే, ప్రజల్లో ఆవిడ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనేది నిజం. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆవిడకు అపాయింట్మెంట్ ఇస్తారా? లేదా? వెయిట్ అండ్ సి.

Also Readబాక్సాఫీస్ బరిలో 9000 కోట్లు, ఆస్కార్స్‌లో 2 అవార్డులు... హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Embed widget