Haricharan Singer: ఆకాశంలోని చందమామ... హరిచరణ్ స్వరంలో మరో ప్రేమ పాట
Hariharan new Telugu song: తెలుగులో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన హరిచరణ్, ఓ చిన్న సినిమాలో మంచి పాట పాడారు. ఇటీవల ఆ సాంగ్ విడుదలైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాలో 'ఎలా ఎలా...' సాంగ్ గుర్తుందా? 'గోపాల గోపాల' సినిమాలోని 'భజే భజే...' సాంగ్!? రామ్ పోతినేని 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో 'నీ చూపులే...' గుర్తుందా? ఈ మూడిటినీ సింగర్ హరిచరణ్ పాడారు. ఇవే కాదు... ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారు. ఇప్పుడు ఆయన మరో తెలుగు పాట పాడారు. ఓ చిన్న సినిమాలో పాటను హరిచరణ్ ఆలపించడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆకాశంలోని చందమామ... కొత్త పాట!
యువ హీరోలు రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త... హీరోయిన్లు పల్లవి, రమ్యా రెడ్డి నటించిన సినిమా '6 జర్నీ'. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ టేస్టీ తేజ ప్రధాన పాత్రలో సందడి చేయనున్నారు. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ పతాకంపై సినిమా రూపొందుతోంది. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
6th Journey Movie: '6th జర్నీ' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'ఆకాశంలోని చందమామ...' పాటను సింగర్ హరిచరణ్ ఆలపించారు. ఇటీవల ఆ పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు ఎం.ఎన్. సింహ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి రామారావు మాతుమూరు రాశారు.
'ఆకాశంలో చందమామ' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... ''మా అరుణ కుమారి ఫిలింస్ సంస్థలో రూపొందుతున్న '6 జర్నీ' సినిమా నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా అందమైన ప్రేమ పాట, ప్రముఖ గాయకుడు హరిచరణ్ ఆలపించిన 'ఆకాశంలోని చందమామ...' విడుదల చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ట్రైలర్, ఆ తర్వాత విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు. ''ప్రేమ, థ్రిల్లింగ్ సహా అన్ని అంశాలతో '6 జర్నీ' తెరకెక్కుతోంది'' అని దర్శకుడు బసీర్ ఆలూరి తెలిపారు.
Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?
Haricharan New Telugu Song in 6th Journey movie: రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరామ్, సంజయ్ ఆచార్య, 'జబర్దస్త్' చిట్టిబాబు, అవంతిక, సోహైల్, సాయి సాగర్, షరీష్, బాబా కల్లూరి, మిలటరీ ప్రసాద్, సాహితీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రవి కుంచాల, ఎం. గుణ రెడ్డి, కూర్పు: ఎన్. శ్రీనుబాబు, సంగీతం: ఎం.ఎన్. సింహ, పాటలు: రామారావు మాతుమూరు, ఛాయాగ్రహణం: టి. సురేందర్ రెడ్డి, సమర్పణ: పాల్యం శేషమ్మ, బసిరెడ్డి, నిర్మాణ సంస్థ: అరుణ కుమారి ఫిలింస్, నిర్మాత: పాల్యం రవి ప్రకాష్ రెడ్డి, దర్శకత్వం: బసీర్ అలూరి.