అన్వేషించండి

Hanuman Box Office Collections: బాక్సాఫీసు వద్ద 'హనుమాన్‌' దూకుడు - వారం రోజులైన తగ్గని కలెక్షన్ల జోరు, ఎంతంటే?

Hanuman Movie: చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టింది. తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. బాలీవుడ్‌లో ఊహించని రెస్పాన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

Hanuman Collections: సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాలు, అగ్ర హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టింది హనుమాన్‌ మూవీ. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, కుర్ర హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. సో సో అంచనాలతో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టింది. ఒక్క తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. ఇక బాలీవుడ్‌లో అయితే ఊహించని రెస్పాన్స్‌తో రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. అక్కడ రోజురోజుకు థియేటర్లను పెంచుకుంటూ సర్‌పైజింగ్‌ కలెక్షన్స్‌ రాబడుతుంది. చూస్తుంటే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వరకు నార్త్‌లో హనుమాన్‌ హవా కొనసాగేలా కనిపిస్తోందంటున్నారు ట్రేడ్‌ వర్గాలు.

అలా విడుదలైన  వారంలోపే హనుమాన్‌ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. వారం దాటిన కూడా అదే జోరు కనబరుస్తూ నయా రికార్డు సొంతం చేసుకుంది. వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. 150 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకు హనుమాన్‌ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు మేకర్స్‌.  హనుమాన్‌ జోరు చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ వాటిని ఎదురు నిలబడి ఓ చిన్న సినిమా ఇంత భారీ హిట్‌ కొట్టడమంటే సాధారణ విషయం కాదని, ఇది అంతా ప్రశాంత్‌ వర్మ మేకింట్‌, టేకింగ్‌ వల్లే అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ కావాల్సిన 75 కోట్ల షేర్‌ రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధించి మేకర్స్‌ను లాభాల్లో పడేసింది. ఇక ఈ తాజా కలెక్షన్స్‌తో హనుమాన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ వైపు పరుగులు పెడుతుంది.

విజువల్‌ వండర్‌తో స్టార్స్‌ను కట్టిపడేసిన 'హనుమాన్‌'

హనుమాన్‌ సినిమాకు ఆడియన్స్‌కు మాత్రమే సినీ, ఇండస్ట్రీ ప్రముఖులను సైతం ఫిదా అవుతున్నారు. మూవీ చూసిన సెలబ్రెటీలు ఒక్కొక్కరు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హనుమాన్‌ మూవీ ఒక అద్భుతమంటూ తమ రివ్యూను ప్రకటించారు. వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు ఉండటం విశేషం. అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందని సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ సైతం హనుమాన్‌ మెచ్చుకున్నారు. అంతేకాదు నేరుగా మూవీ టీంను కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంతార మూవీ డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి కూడా హనుమాన్‌ మూవీని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు.

రీసెంట్‌గా స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం హనుమాన్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యింది. అనంతరం తన అనుభూతిని సోషల్‌ మీడియాలో పంచుకుంది. "మనలోని చిన్నిపిల్లల మనస్తత్వాన్ని బయటికి తీసుకొచ్చే సినిమాలే గొప్ప సినిమాలు అని నేను నమ్ముతాను. ఎగ్జైటింగ్ విజువల్స్, సినిమాటిక్ హై, హ్యూమర్, మ్యాజిక్, దాంతో పాటు అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్, పర్ఫార్మెన్స్‌లు.. ఇలా అన్ని ఒకే దగ్గర చేరాయి. హనుమాన్‌ను పెద్ద స్క్రీన్‌‌పై చూడడం అద్భుతంగా ఉంది. థాంక్యూ ప్రశాంత్ వర్మ. నీ యూనివర్స్‌లోని తరువాత చాప్టర్లను చూడడానికి ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్‌? వరుడు ఎవరంటే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Embed widget