Hansika's '105 Minutes': హన్సిక నటనకు ఆ 105 నిమిషాలు ఒక అగ్ని పరీక్ష
Hansika 105 Minutes Trailer : హన్సిక ప్రధాన పాత్రలో నటించిన '105 మినిట్స్' ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీలైన్ ఏంటంటే...
హన్సిక... గ్లామరస్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఇన్ని రోజులూ ఆవిడను దర్శక నిర్మాతలు ఆ కోణంలో చూపించారు. అయితే, ఆమెలో నటిని కొత్త కోణంలో చూపించనున్నారు దర్శక నిర్మాతలు 'బొమ్మక్' శివ, రాజు దుస్సా. హన్సికతో వాళ్ళు ఓ సినిమా చేశారు.
హన్సిక ఒక్కరే...
ఇంకెవరూ లేరు!
హన్సిక (Hansika Motwani) ప్రధాన పాత్రలో రాజ్ దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' (105 Minutes Movie). దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో హన్సిక తప్ప ఇంకెవరూ లేరు. వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్‌తో రూపొందిన చిత్రమిది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... సింగిల్ షాట్ మూవీ అని యూనిట్ సభ్యులు తెలిపారు. హాలీవుడ్ మూవీస్ 'బర్డ్ మన్', '1917' సినిమాల తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఫస్ట్ కాపీ రెడీ...
త్వరలో ట్రైలర్!
Hansika's 105 Minutes Trailer : '105 మినిట్స్' ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని నిర్మాత 'బొమ్మక్' శివ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇదొక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అతి త్వరలో ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రపంచంలోనే మొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌తో తీసిన చిత్రమిది. సింగిల్ షాట్ మూవీస్ కొన్ని వచ్చాయి. అయితే, వాటిలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. మా '105 మినిట్స్'లో మాత్రం ఒక్కటే క్యారెక్టర్ ఉంటుంది. సినిమా నిడివి 1.45 గంటలే. ఒక్క క్యారెక్టర్ అయినా సరే... స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు రాజు దుస్సా ఎంగేజింగ్‌గా తీశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇండియాలో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. మేం గ్రీన్ మ్యాట్ వాడలేదు. లైవ్ షూట్ చేసి సీజీ వర్క్స్ చేశాం'' అని తెలిపారు.
హన్సికకు ఈ సినిమా అగ్ని పరీక్షే!
హన్సిక గ్లామర్ రోల్స్ చేసినా... కొన్ని సినిమాల్లో నటిగా తనను తాను ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు. అయితే... సినిమాలో ఇతర క్యారెక్టర్లు కూడా ఉండటంతో ఆవిడ మీద మిగతా సన్నివేశాల్లో ఫోకస్ తక్కువ ఉంటుంది. '105 మినిట్స్'లో అలా కాదు... సినిమా మొత్తం మీద ఆవిడ తప్ప మరొకరు కనిపించరు. అందువల్ల, అందరి అటెన్షన్ హన్సిక మీద ఉంటుంది. సినిమా అంతా తన భుజాలపై ఆవిడ నడిపించాల్సి ఉంటుంది.
Also Read : హత్య చేసి జైలుకొచ్చిన అనాథ - ఎస్కేప్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా?
అదృశ్య శక్తి నుంచి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా హన్సిక అద్భుతంగా నటించారని, ప్రతి సన్నివేశంలో అద్భుతమైన హావభావాలు ప్రకటించారని దర్శక నిర్మాతలు తెలిపారు. హన్సిక నటన సినిమాకు హైలైట్ అవుతుందని పేర్కొన్నారు. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం, రహ్మ కడలి ఆర్ట్ వర్క్, కిషోర్ బోయిదాపు కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయని తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిలింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత & స్క్రిప్ట్ చీఫ్ అసోసియేట్ : రూప కిరణ్ గంజి, కూర్పు : శ్యామ్ వడవల్లి, ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి, సంగీతం : సామ్ సిఎస్, సహ నిర్మాత : బొమ్మక్ యషిత, నిర్మాత : బొమ్మక్ శివ, రచన - దర్శకత్వం : రాజు దుస్సా.