By: ABP Desam | Updated at : 31 Jan 2023 11:33 AM (IST)
'థగ్స్' సినిమాలో ప్రధాన తారాగణం
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ (Brinda Gopal) దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కోనసీమ థగ్స్'. 'హే సినామికా' తర్వాత ఆమె నుంచి వస్తున్న చిత్రమిది. దర్శకురాలిగా రెండోది. ఇందులో బాబీ సింహ (Bobby Simha), ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య తారాగణం. హ్రిదు హరూన్ హీరో. ఇతర భాషల్లో 'థగ్స్'గా విడుదల కానుంది.
'కోనసీమ థగ్స్' ఎస్కేప్ ప్లాన్ ఏమైంది?
Konaseema Thugs Trailer : ఇటీవల 'కోనసీమ థగ్స్' తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. రా అండ్ రస్టిక్ థీమ్‌తో ఆ ట్రైలర్ సాగింది. అందులో ఏ ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ఇంట్రడ్యూస్ చేశారు.
హత్య చేసి జైలుకు వచ్చిన అనాథగా హ్రిదు హరూన్ కనిపించారు. అప్పటికి జైల్లో ఉన్న వ్యక్తులుగా మునిష్కంత్, బాబీ సింహాను చూపించారు. వాళ్ళంతా కలిసి ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. అయితే... ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. సెకండ్ అటెంప్ట్ ఎలా చేశారు? ఏమైంది? అనేది సినిమా. పోలీస్ రోల్ చేసిన ఆర్.కె. సురేష్ వీళ్ళను ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి. యాక్షన్ ఎపిసోడ్స్ & రస్టిక్ ఫీల్ హైలైట్ అయ్యాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది.
Also Read : మహేష్ మూవీ ఓటీటీ రైట్స్ @ 80 కోట్లు!
హ్రిదు హరూన్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా 'థగ్స్'. ఆయన వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. అంటే... హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద తొలి సినిమా. కానీ, నటుడిగా కాదు! అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన క్రాష్ కోర్స్ వెబ్ సీరీస్ (Crash Course Web Series) లో హ్రిదు హరూన్ నటించారు. అందులో సత్య శ్రీవత్సన్ పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'మంబైకర్'లో కూడా ఆయన నటించారు.
ఫిబ్రవరిలో 'థగ్స్' రిలీజ్!
Thugs Movie Release Date : 'థగ్స్' సినిమాలో ఎక్కువ మంది తమిళ నటీనటులు ఉన్నారు. బాబీ సింహా, హ్రిదు హరూన్‌లకు నేషనల్ లెవల్‌లో రికగ్నైజేషన్ ఉంది. ఈ సినిమాను హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. 'థగ్స్' మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది.
'థగ్స్' చిత్రాన్ని రా అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు నిర్మాత రియా షిబు తెలిపారు. హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై ఈ ఇసినిమా రూపొందుతోంది. విజయ్ 'పులి', విక్రమ్ 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్'తో పాటు హిందీ సినిమా 'ముంబైకర్' నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు (Riya Shibu Producer). తమిళంలో 'ఆర్ఆర్ఆర్', 'విక్రమ్', 'డాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను హెచ్.ఆర్. పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
ఈ చిత్రానికి శామ్ సి.ఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తుండగా... 'ఆర్ఆర్ఆర్' ప్రోమో ఎడిటర్‌గా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ డిజైనర్ : జోసెఫ్ నెళ్లికల్, యాక్షన్ : ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ముత్తు కురుప్పయ్య, కాస్ట్యూమ్స్ : మాలిని కార్తికేయన్.a
Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
Gruhalakshmi March 21st: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య
Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి
Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం