By: ABP Desam | Updated at : 31 Jan 2023 10:42 AM (IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Image Courtesy:Mahesh Babu Instagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యూనరేషన్ (Mahesh Babu remuneration) ఎంత? ఆయన గానీ, నిర్మాతలు గానీ ఎప్పుడూ చెప్పింది లేదు. అయితే... ఓ సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయలు అని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన తీసుకునే అమౌంట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా వచేశాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మహేష్ - త్రివిక్రమ్ మూవీ...
ఐదు భాషల్లో గురూజీ మేజిక్!
మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్న చిత్రమిది. హీరోగా మహేష్ 28వ చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది.
మహేష్ బాబుకు మాత్రమే కాదు... గురూజీ త్రివిక్రమ్‌కు సైతం తొలి పాన్ ఇండియా చిత్రమిది. అందువల్ల, దీనిపై భారీ అంచనాలు ఉన్నారు. అప్పట్లోనే భారీ రేటు ఆఫర్ చేసి మరీ నెట్‌ఫ్లిక్స్ రైట్స్ తీసుకుందని తెలిసింది. ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత అనేది బయటకు వచ్చింది.
ఓటీటీ రైట్స్ @ 80 కోట్లు!
మహేష్, త్రివిక్రమ్ సినిమా ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు, ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం. దీంతో మహేష్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ వచ్చినట్టు లెక్క. హీరో, డైరెక్టర్ కాంబినేషన్ చూస్తే... థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని అంచనా. సో... విడుదలకు ముందు నిర్మాతలకు ప్రాఫిట్ గ్యారెంటీ.
నాన్ స్టాప్‌గా షూటింగ్!
సంక్రాంతి తర్వాత SSMB 28 సెట్స్ మీదకు వెళ్ళింది. నిరవధికంగా షూటింగ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ గతంలోనే పేర్కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల... వైకుంఠపురములో' సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు.
ఆగస్టు 11 టు అక్టోబర్ 18కా? సంక్రాంతికా?
ఆగస్టు 11న మహేష్ - త్రివిక్రమ్ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఆ తేదీకి కాకుండా అక్టోబర్ 18న విడుదల చేయాలని భావిస్తున్నారట! మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వెళ్లినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. త్వరలో విడుదల విషయమై నిర్మాతల నుంచి క్లారిటీ రానుంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.
Also Read : తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?