By: ABP Desam | Updated at : 31 Jan 2023 09:35 AM (IST)
నందమూరి తారక రత్న, మెగాస్టార్ చిరంజీవి
తారకరత్న ఆరోగ్యం (Taraka Ratna Health) చిరంజీవి (Chiranjeevi) ఓ మంచి మాట చెప్పారు. నందమూరి హీరో గురించి మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రేక్షకులకు ఊరట ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంతకీ, చిరు ఏమన్నారంటే...
ప్రమాదం లేదు - చిరంజీవి''సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు. 'ఇక ఏ ప్రమాదం లేదు' అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అతను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ... ఈ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారక రత్న... నీకు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.
May you have a long and healthy life dear Tarakaratna!— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళిన తారక రత్న... కుప్పంలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందుతోంది.
నందమూరి బాలకృష్ణ, తారక రత్న తండ్రి నందమూరి మోహన కృష్ణ, సతీమణి అలేఖ్యా రెడ్డి సహా కుటుంబ సభ్యులు నారాయణ హృదయాలయలో ఉన్నారు. దగ్గరుండి మరీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు నారాయణ హృదయాలయ హెల్త్ బులిటెన్స్ విడుదల చేస్తోంది. ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. ''తారక రత్నను ఆసుపత్రిలో చూశా. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. తారక రత్న అన్న ఫైటర్. పూర్తిగా కోలుకొని త్వరగా తిరిగి వచ్చేస్తారు. చికిత్సకు అన్నయ్య స్పందిస్తున్న తీరుపై వైద్యులు కూడా సంతృప్తిగా ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి అన్నతో అనుబంధం ఉంది. ఆయన నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి. త్వరగా కోలుకుని తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని మంచు మనోజ్ చెప్పారు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
తారక రత్నకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుకు గురైన సమయం నుంచి ఆసుపత్రికి తరలించిన సమయంలో దాదాపు అరగంట వరకూ ఆయన శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయిందని సమాచారం. దీంతో ఆ ప్రభావం మెదడుపై కూడా పడటంతో పరిస్థితి ఇంకా విషమించిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయనకు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. మరోవైపు మెదడుకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 95 శాతం గుండె బలహీనం కావడంతో ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని, దగ్గుబాటి పురందేశ్వరి, హీరో మంచు మనోజ్ తదితరులు బెంగళూరు వెళ్ళి వచ్చారు. తారక రత్నను పరామర్శించిన అనంతరం... ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, శరీరం చికిత్సకు సహకరిస్తోందని తెలిపారు.
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?