అన్వేషించండి

Making Of Guntur Kaaram : త్రివిక్రమ్, శ్రీలీల నవ్వులు, మహేష్ మాస్ ఎనర్జీ అదుర్స్ - 'మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం' వీడియో చూశారా?

Making Of Guntur Kaaram : 'గుంటూరు కారంజ్ సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

Maheshbabu's Guntur Kaaram Making Video : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంక్రాంతికి 4 సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటే అందరి కళ్ళు గుంటూరు కారం పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి.

ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 39 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని అన్ని రికార్డులను చెరిపేసింది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్లో లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై భారీ హైప్ ఉంది. చాలాకాలం తర్వాత ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ‘గుంటూరు కారం’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. 'మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం' పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియోలో టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేసిందో కనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీలీల, త్రివిక్రమ్ నవ్వులు.. మహేష్ బాబు డైలాగ్స్, ఫైట్ సీన్స్ హైలైట్‌గా వీడియోలో హైలైట్ గా నిలిచాయి.

ఇందులో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా తన స్వాగ్ తో అదరగొట్టేసాడు. కాగా ఈ వీడియోలో నాగ వంశీ, దిల్ రాజు సెట్స్ లో మూవీ టీమ్‌తో మాట్లాడుతూ కనిపించడం విశేషం. మొత్తంగా మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం తో మరోసారి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి  సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా  సినిమాకి ఎలాంటి కట్స్ చెప్పలేదట. దాదాపు 159 నిమిషాల రన్ టైం (అంటే 2 గంటల 39 నిమిషాల) తో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి కొన్ని సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ ని మాత్రమే మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది.

దాని ప్రకారం జీరో కట్స్ తో 'గుంటూరు కారం' థియేటర్స్ లో సందడి చేయబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవగారించారు థమన్ సంగీతం అందించారు.

Also Read : మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ - అప్పటి రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు వైరల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget