Gopichand 32 : మిలాన్‌లో గోపీచంద్ వర్క్ ఫినిష్ - కావ్యా థాపర్‌తో పాట కూడా!
Gopichand New Movie : మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా మిలాన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్. హీరోగా గోపీచంద్ 32వ చిత్రమిది. అందుకని, వర్కింగ్ టైటిల్‌గా #Gopichand32 అని పెట్టారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన శ్రీను వైట్ల... కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కోసం టీమ్ ఇటలీ వెళ్ళింది. ఆ షెడ్యూల్ ముగిసింది.
గోపీచంద్, కావ్యపై పాట కూడా!
ఇటలీలోని మిలాన్ నగరంలో Gopichand 32 movie ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. కొన్ని యాక్షన్ సీన్లు తీయడంతో పాటు గోపీచంద్, కావ్యా థాపర్ మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను కూడా పిక్చరైజ్ చేశారు. మిలాన్ షెడ్యూల్ బాగా జరిగిందని దర్శకుడు శ్రీను వైట్ల పేర్కొన్నారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్ర బృందంతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతి అని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
Also Read : బోయపాటి vs తమన్ - తెలివిగా తమన్‌కు ఓటేసిన అనిల్ రావిపూడి
HAD A GREAT SCHEDULE IN MILAN.. pic.twitter.com/rzH8o2dQKJ
— Sreenu Vaitla (@SreenuVaitla) October 13, 2023
'విశ్వం' టైటిల్ ఖరారు చేశారా?
గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. ఈ చిత్రానికి 'విశ్వం' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే... చిత్ర బృందం ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. గోపీచంద్ సినిమా చివర సున్నా వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉంది. ఒకట్రెండు సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేదు. మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి.
Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?
View this post on Instagram
గోపీచంద్ 32 సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వేణు దోనెపూడి (Venu Donepudi) మాట్లాడుతూ ''దివంగత కథానాయకుడు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదంతో మా చిత్రాలయం స్టూడియోస్ ప్రారంభించాం. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలనేది మా లక్ష్యం. గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా మా సంస్థలో మొదటి సినిమా. మెజారిటీ సన్నివేశాలను విదేశాల్లో షూటింగ్ చేస్తాం. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్'' అని చెప్పారు.
ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు ఆయన రైటింగ్ విభాగంలో పని చేశారు. శ్రీను వైట్ల తీసిన సూపర్ హిట్ సినిమాలు 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలు సైతం అందించారు. గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా పని చేశారు.
'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు కొన్ని చిత్రాలకు మంచి బాణీలు, నేపథ్య సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలో ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను వెల్లడిస్తామని నిర్మాత వేణు దోనెపూడి తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial